ఇన్నేసి డబ్బులు పోసి ఈ పుస్తకం కొని గంటలు గంటలు వెచ్చించి చదవడానికి, అందులో మనకి తెలీని కొత్త విషయాలు ఏముంటాయి? నారు పోసిన వాడు నీరు పోయకమానాడు. కడుపున పుట్టిన బిడ్డలకి పాలివ్వడానికి ఇంత కసరత్తు అవసరమా? అదేమన్నా కళా నేర్చుకోవడానికి అనేవారికి నా విన్నపం ఒక్కటే! బిడ్డల పెంపకం నిజంగా కళే! పెంపకంలో అన్నిటికంటే ప్రధానమైనది, పాపాయి పోషణ. బిడ్డలు సర్వతో ముఖాభివృద్ధి సాధించి నిజంగా బంగారు కొండలు కావాలంటే అమ్మకావాలి! అమ్మ వొడి కావాలి.
అమ్మ లాలన, ప్రేమ తల్లి పాలివ్వడంతో బిడ్డకు పరిపుష్టిగా లభిస్తుంది. పాలివ్వడం పెద్ద ఘన కార్యంకాదు. చూస్తే యిట్టె వచ్చేస్తుంది. కొత్తగా తల్లులయిన యువతులు అది చూసి నేర్చుకునే లోపల తల్లి బిడ్డలు ఇద్దరూ కొన్నిసార్లు అసహనానికి గురవుతారు. ఇద్దరి మధ్య వొద్దిక కుదరకపోతే వ్యవహారం పోతపాలకు దిగజారి చేజేతులా కొన్ని సమస్యలను ఆహ్వానించిన వారము అవుతాము. బిడ్డ రాకతో తల్లి జన్మ చరితార్థం అవుతుందంటారు. అందులో ఎంతో నిజం వుంది. బిడ్డల పెంపకం మాధుర్యభరితమైంది. అలాంటి మాధుర్యాన్ని అందిపుచ్చుకొని మనసారా అనుభవించాలంటే కొత్తగా తల్లులు కాబోయే యువతులు తెలుసుకోవలసినవి ఎన్నో వున్నాయి. అందులో భాగంగా చేసిన చిన్న ప్రయత్నమే ఈ పుస్తక రూపం.
ఇన్నేసి డబ్బులు పోసి ఈ పుస్తకం కొని గంటలు గంటలు వెచ్చించి చదవడానికి, అందులో మనకి తెలీని కొత్త విషయాలు ఏముంటాయి? నారు పోసిన వాడు నీరు పోయకమానాడు. కడుపున పుట్టిన బిడ్డలకి పాలివ్వడానికి ఇంత కసరత్తు అవసరమా? అదేమన్నా కళా నేర్చుకోవడానికి అనేవారికి నా విన్నపం ఒక్కటే! బిడ్డల పెంపకం నిజంగా కళే! పెంపకంలో అన్నిటికంటే ప్రధానమైనది, పాపాయి పోషణ. బిడ్డలు సర్వతో ముఖాభివృద్ధి సాధించి నిజంగా బంగారు కొండలు కావాలంటే అమ్మకావాలి! అమ్మ వొడి కావాలి. అమ్మ లాలన, ప్రేమ తల్లి పాలివ్వడంతో బిడ్డకు పరిపుష్టిగా లభిస్తుంది. పాలివ్వడం పెద్ద ఘన కార్యంకాదు. చూస్తే యిట్టె వచ్చేస్తుంది. కొత్తగా తల్లులయిన యువతులు అది చూసి నేర్చుకునే లోపల తల్లి బిడ్డలు ఇద్దరూ కొన్నిసార్లు అసహనానికి గురవుతారు. ఇద్దరి మధ్య వొద్దిక కుదరకపోతే వ్యవహారం పోతపాలకు దిగజారి చేజేతులా కొన్ని సమస్యలను ఆహ్వానించిన వారము అవుతాము. బిడ్డ రాకతో తల్లి జన్మ చరితార్థం అవుతుందంటారు. అందులో ఎంతో నిజం వుంది. బిడ్డల పెంపకం మాధుర్యభరితమైంది. అలాంటి మాధుర్యాన్ని అందిపుచ్చుకొని మనసారా అనుభవించాలంటే కొత్తగా తల్లులు కాబోయే యువతులు తెలుసుకోవలసినవి ఎన్నో వున్నాయి. అందులో భాగంగా చేసిన చిన్న ప్రయత్నమే ఈ పుస్తక రూపం.© 2017,www.logili.com All Rights Reserved.