ఏ దేశానికైనా స్వతంత్రం వస్తే జాతీయభావాలు బలపడతాయి. కానీ మన దేశంలో మాత్రం స్వతంత్రం తర్వాత ప్రాంతీయ తత్వము, సంకుచితమైన ప్రాంతీయ వాదాలు లాంటి పరిణామాలు ఏర్పడ్డాయి. రాజకీయ నినాదాలు ఎన్ని ఉన్నా సగటు భారతీయుని మనస్సులో రామాయణం, భారతం, పురాణాలు ఉండడం దేశ సమగ్రతకు రక్ష.
నాస్తికత్వానికీ, వేదాంతానికీ కొంత పోలిక చూడగలం. అన్ని సమాజాల్లోనూ మనుషులు రకరకాల దేవుళ్ళను పూజిస్తూ మా దేవుడే నిజమైన దేవుడనే వాదన చేస్తుంటారు. ఈ దేవుళ్ళకు ఒక పేరు, రూపం, ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. కానీ ఇద్దరికీ విశ్వాసం ప్రధానం. విశ్వాసం అంటే శాస్త్రీయంగా నిరూపించలేనిది. నీ విశ్వాసం తప్పు, నా విశ్వాసమే సరైనది అనడం అజ్ఞానం. అందువల్ల మనుషులందరూ మామూలుగా పూజించే దేవుళ్ళను నాస్తికుడు అంగీకరించడు. వేదాంతి కూడా అదే ధోరణిలో ఉంటాడు. ఒకానొక ఉపనిషత్తులో నువ్వు పూజించేది పూర్తి సత్యం కాదు అంటాడు. నాస్తికుడు దేవుణ్ణి నిందించి స్వర్గం, నరకం ఏవీ లేవు, నమ్మకాలన్నీ వ్యర్థమైనవే అని ఊరకుండిపోతాడు. వేదాంతి అలా కాకుండా ఇవన్నీ సత్యం కానపుడు సత్యమేమిటి అంటూ సమాధానాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగుతాడు.
ఏ దేశానికైనా స్వతంత్రం వస్తే జాతీయభావాలు బలపడతాయి. కానీ మన దేశంలో మాత్రం స్వతంత్రం తర్వాత ప్రాంతీయ తత్వము, సంకుచితమైన ప్రాంతీయ వాదాలు లాంటి పరిణామాలు ఏర్పడ్డాయి. రాజకీయ నినాదాలు ఎన్ని ఉన్నా సగటు భారతీయుని మనస్సులో రామాయణం, భారతం, పురాణాలు ఉండడం దేశ సమగ్రతకు రక్ష. నాస్తికత్వానికీ, వేదాంతానికీ కొంత పోలిక చూడగలం. అన్ని సమాజాల్లోనూ మనుషులు రకరకాల దేవుళ్ళను పూజిస్తూ మా దేవుడే నిజమైన దేవుడనే వాదన చేస్తుంటారు. ఈ దేవుళ్ళకు ఒక పేరు, రూపం, ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. కానీ ఇద్దరికీ విశ్వాసం ప్రధానం. విశ్వాసం అంటే శాస్త్రీయంగా నిరూపించలేనిది. నీ విశ్వాసం తప్పు, నా విశ్వాసమే సరైనది అనడం అజ్ఞానం. అందువల్ల మనుషులందరూ మామూలుగా పూజించే దేవుళ్ళను నాస్తికుడు అంగీకరించడు. వేదాంతి కూడా అదే ధోరణిలో ఉంటాడు. ఒకానొక ఉపనిషత్తులో నువ్వు పూజించేది పూర్తి సత్యం కాదు అంటాడు. నాస్తికుడు దేవుణ్ణి నిందించి స్వర్గం, నరకం ఏవీ లేవు, నమ్మకాలన్నీ వ్యర్థమైనవే అని ఊరకుండిపోతాడు. వేదాంతి అలా కాకుండా ఇవన్నీ సత్యం కానపుడు సత్యమేమిటి అంటూ సమాధానాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగుతాడు.© 2017,www.logili.com All Rights Reserved.