శ్రీనాథుని భీమేశ్వర పురాణము
స్థానీయత కొన్ని అపూర్వాంశాలు
పాయకొక చోట చతికిలబడగ నుండ
నైన ఫలమేమి? యటు వినోదార్థ మరిగి
సంచరింతముగాక యీ జలజహితుని
ధర్మమౌర్జిత్యమునుఁ బొంద దక్షపురిని - భీ.పు. 5-16
కవిగా గొప్ప దిమ్మరి కావడం వల్ల శ్రీనాథుని కాలంనాటి ఆంధ్రభూమికి చెందిన చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక ఆనవాళ్ళు ఆయన కావ్యాల్లో, చాటువుల్లో శిలాక్షరాలయ్యాయి. పై పద్యం కైలాసనాథుని ద్వారా శ్రీనాథుడు సందర్భానుసారం చెప్పించినా (శివుడూ దిమ్మరే కదా!) భావం మాత్రం శ్రీనాథుని జీవితానుభవంలోనిది.
ఊసుపోకో (భీ.పు.5-15), రాజ సందర్శనార్థమో, రాయబారిగానో, పొట్టగడవడానికో, తీర్థయాత్రాది కృత్యంగానో ఆ కాలంనాటి ఆంధ్ర ప్రాంతమంతా శ్రీనాథుడు కలయదిరిగాడు. అంతేగాక ప్రౌఢదేవరాయల ఆస్థానానికి కన్నడ ప్రాంతమూ (విద్యానగరం), పెదకోమటి వేమారెడ్డితో కాశీ సంచరించాడు. శైవారాధన తత్పరుడు (శైవమే పరమమనే సంకుచితుడు కాడు. ఇదే కావ్యంలో అవతారికలో రాధాగోపాలుని 1-3 కొలిచాడు) కాబట్టి ఆ కాలపు మిగిలిన శ్రీనాథుడు పేర్కొనని దక్షిణభారత శైవక్షేత్రాల్ని శ్రీనాథుడు దర్శించిన దఖలు ఎక్కడా పడకపోవడానికి కారణం, ఆయన ఆ ప్రాంతాలలో సంచరించక పోవడమే కావచ్చు. కారణం తాను కాలుపెట్టిన ప్రాంతపు విభావాన్నీ, దైన్యాన్నీ ఉన్నదున్నట్టు చెప్పడం శ్రీనాథుని నైజం.
భీమేశ్వర పురాణం చెప్పడానికి ముందు పల్నాడు తిరిగిన సందర్భంలో ఆ ప్రాంతపు అన్నపానాల లోటుకు (అంగడి యూరలేదు, రసికుడు పోవడు. చాటువులు) ఎంతగానో నోరు చేసుకొన్నాడు. అక్కడి శుచీ శుభ్రతా లేని పురోహితుని యింటి స్థితి మొత్తాన్నీ (దోసెడు కొంపలో చాటువు) ఈసడించాడు. తాగడానికి నీళ్ళుగానీ, తినడానికి వరియన్నముగానీ లేని పలనాటి నుండి................
శ్రీనాథుని భీమేశ్వర పురాణము స్థానీయత కొన్ని అపూర్వాంశాలు పాయకొక చోట చతికిలబడగ నుండ నైన ఫలమేమి? యటు వినోదార్థ మరిగి సంచరింతముగాక యీ జలజహితునిధర్మమౌర్జిత్యమునుఁ బొంద దక్షపురిని - భీ.పు. 5-16 కవిగా గొప్ప దిమ్మరి కావడం వల్ల శ్రీనాథుని కాలంనాటి ఆంధ్రభూమికి చెందిన చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక ఆనవాళ్ళు ఆయన కావ్యాల్లో, చాటువుల్లో శిలాక్షరాలయ్యాయి. పై పద్యం కైలాసనాథుని ద్వారా శ్రీనాథుడు సందర్భానుసారం చెప్పించినా (శివుడూ దిమ్మరే కదా!) భావం మాత్రం శ్రీనాథుని జీవితానుభవంలోనిది. ఊసుపోకో (భీ.పు.5-15), రాజ సందర్శనార్థమో, రాయబారిగానో, పొట్టగడవడానికో, తీర్థయాత్రాది కృత్యంగానో ఆ కాలంనాటి ఆంధ్ర ప్రాంతమంతా శ్రీనాథుడు కలయదిరిగాడు. అంతేగాక ప్రౌఢదేవరాయల ఆస్థానానికి కన్నడ ప్రాంతమూ (విద్యానగరం), పెదకోమటి వేమారెడ్డితో కాశీ సంచరించాడు. శైవారాధన తత్పరుడు (శైవమే పరమమనే సంకుచితుడు కాడు. ఇదే కావ్యంలో అవతారికలో రాధాగోపాలుని 1-3 కొలిచాడు) కాబట్టి ఆ కాలపు మిగిలిన శ్రీనాథుడు పేర్కొనని దక్షిణభారత శైవక్షేత్రాల్ని శ్రీనాథుడు దర్శించిన దఖలు ఎక్కడా పడకపోవడానికి కారణం, ఆయన ఆ ప్రాంతాలలో సంచరించక పోవడమే కావచ్చు. కారణం తాను కాలుపెట్టిన ప్రాంతపు విభావాన్నీ, దైన్యాన్నీ ఉన్నదున్నట్టు చెప్పడం శ్రీనాథుని నైజం. భీమేశ్వర పురాణం చెప్పడానికి ముందు పల్నాడు తిరిగిన సందర్భంలో ఆ ప్రాంతపు అన్నపానాల లోటుకు (అంగడి యూరలేదు, రసికుడు పోవడు. చాటువులు) ఎంతగానో నోరు చేసుకొన్నాడు. అక్కడి శుచీ శుభ్రతా లేని పురోహితుని యింటి స్థితి మొత్తాన్నీ (దోసెడు కొంపలో చాటువు) ఈసడించాడు. తాగడానికి నీళ్ళుగానీ, తినడానికి వరియన్నముగానీ లేని పలనాటి నుండి................© 2017,www.logili.com All Rights Reserved.