అతడు రసవద్గంలో మునిగిన ద్రాక్ష గింజల్ని తూటాలుగా మార్చగలడు. అక్షరాలను మరతుపాకులుగా కూర్చగలడు. ఖాళీస్థలాలను పోరాటక్షేత్రాలుగా నాటగలడు. అతను కవిత్వ సాధనాలను కొత్తగా పోతపోసి బహుకరించాడు. కవుల చేతుల్లోంచి వచనంగా జారిపడ్డ శబ్దాలకు కొత్త అర్థాలను ఇచ్చి చూశాడు. అతడి శిక్షణ రాజకీయోద్యమం. అతడు నేర్పిన విద్య రహస్యోద్యమం. మంచి రూపసి కనుక రూపాన్ని ప్రేమించినంతగా సారాన్నీ ప్రేమించాడు. మానవసారాన్ని పదాల పడవల కెక్కించి మన గుండెల్లోకి నేరుగా మోశాడు. అతడందరికీ తెలిసేట్లుగానే ఆయుధాగారాలను డంప్ చేశాడు. వ్యవస్థీకృత ఆధిపత్యం పైకి దండెత్తి, దండెత్తి భావాలను ఉద్రేకాశ్వమై జయించాడు.
అతడు నిర్వహించిన కవిత్వ ఆశ్వమేధయాగంలో ప్రతి కవి రాజ్యమూ తన సింహాసనాన్ని తానే కూల్చుకుంది. ఎక్కడ ఎప్పుడు పట్టుబడ్డా అసలు రహస్యం వెల్లడించే సరికొత్త గేరిల్లాలుగా అతడు వాక్యాలను నిలబెట్టాడు. అతని ప్రథమ శత్రువులు కుటుంబము - రాజ్యము. అతని ద్వితీయ శత్రువులు ఆదిపత్యమూ - అణచివేత.
అతడు రసవద్గంలో మునిగిన ద్రాక్ష గింజల్ని తూటాలుగా మార్చగలడు. అక్షరాలను మరతుపాకులుగా కూర్చగలడు. ఖాళీస్థలాలను పోరాటక్షేత్రాలుగా నాటగలడు. అతను కవిత్వ సాధనాలను కొత్తగా పోతపోసి బహుకరించాడు. కవుల చేతుల్లోంచి వచనంగా జారిపడ్డ శబ్దాలకు కొత్త అర్థాలను ఇచ్చి చూశాడు. అతడి శిక్షణ రాజకీయోద్యమం. అతడు నేర్పిన విద్య రహస్యోద్యమం. మంచి రూపసి కనుక రూపాన్ని ప్రేమించినంతగా సారాన్నీ ప్రేమించాడు. మానవసారాన్ని పదాల పడవల కెక్కించి మన గుండెల్లోకి నేరుగా మోశాడు. అతడందరికీ తెలిసేట్లుగానే ఆయుధాగారాలను డంప్ చేశాడు. వ్యవస్థీకృత ఆధిపత్యం పైకి దండెత్తి, దండెత్తి భావాలను ఉద్రేకాశ్వమై జయించాడు. అతడు నిర్వహించిన కవిత్వ ఆశ్వమేధయాగంలో ప్రతి కవి రాజ్యమూ తన సింహాసనాన్ని తానే కూల్చుకుంది. ఎక్కడ ఎప్పుడు పట్టుబడ్డా అసలు రహస్యం వెల్లడించే సరికొత్త గేరిల్లాలుగా అతడు వాక్యాలను నిలబెట్టాడు. అతని ప్రథమ శత్రువులు కుటుంబము - రాజ్యము. అతని ద్వితీయ శత్రువులు ఆదిపత్యమూ - అణచివేత.© 2017,www.logili.com All Rights Reserved.