దాశరధిగారు కవులే కాదు - వ్యాసాలు, కధలూ, నాటికలూ మొదలైనవి అసంఖ్యాకంగా వ్రాశారు. వారి లేఖినీ మహాత్వంతో పావనం కాని సాహిత్య ప్రక్రియ అంటూ లేదు. వారేది వ్రాసినా ముందుకు తోసుకు పోవాలనే గిజగిజ - యుగయుగాల నుంచి స్తబ్దరూపంలో వుండిపోయిన సంఘాన్ని ముందుకు అతివేగంగా ఒక రాకెట్ వలె నడపాలనే తహతహ ప్రస్పుటంగా కనిపిస్తూ ఉంటుంది.
అయితే గతం యొక్క ప్రాముఖ్యం,ప్రాశస్త్యం వారికి తెలియనిది కాదు. వారు పండిత వంశంలో జన్మించి భారతీయ సంప్రదాయాలను, సంస్కృతీ వైభవాన్ని పూర్తిగా అవలోకన చేసి జీర్ణించుకున్నట్టివారు. దాశరధి గారి కృతులు చదువుతుంటే భావనలోను,భావప్రకటనలోను ఇంత వైవిద్యం ఉన్న కవులు మరొకరు లేరు అనిపిస్తుంది నాకు.
"కంటికి కనిపించినదంతా - కైతగా రాసేస్తున్నాను....
నావి యక్సు - కిరణాల కళ్ళేమో! - నాకేం తెలుసు, లోకమా?
కంటికి కనిపించినదంతా - కైతగా రాసేస్తున్నాను"
అన్న దాశరధిగారు మహాకవులు. ఇదీ అదీ కాకుండా, విస్వాన్నంతా తన హృదయంలోకి పీల్చుకొని పోగలరు. అగ్నిసెగలను, మమతలను, మానవతను బయటకు ఉదగలిగిన ప్రతిభావంతులు. వారు అపారమైన సృజన శక్తీ కలిగిన సృష్టికర్తలు. తమ సృజన శక్తీ విశృంఖలంగా ఉద్దీపించ జేసుకోగలిగిన ధీమంతులు దాశరధిగారు.
- త్రిపురనేని గోపీచంద్
ఇందులో
మహాకవి జక్కన (నవల)
వ్యాసపీటం
నవమి (9 నాటికలు)
అద్దాల మేడ (అంగపూడి రమేష్ చౌదరి గారి హిందీ నవలకు అనువాదం)
దాశరధిగారు కవులే కాదు - వ్యాసాలు, కధలూ, నాటికలూ మొదలైనవి అసంఖ్యాకంగా వ్రాశారు. వారి లేఖినీ మహాత్వంతో పావనం కాని సాహిత్య ప్రక్రియ అంటూ లేదు. వారేది వ్రాసినా ముందుకు తోసుకు పోవాలనే గిజగిజ - యుగయుగాల నుంచి స్తబ్దరూపంలో వుండిపోయిన సంఘాన్ని ముందుకు అతివేగంగా ఒక రాకెట్ వలె నడపాలనే తహతహ ప్రస్పుటంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే గతం యొక్క ప్రాముఖ్యం,ప్రాశస్త్యం వారికి తెలియనిది కాదు. వారు పండిత వంశంలో జన్మించి భారతీయ సంప్రదాయాలను, సంస్కృతీ వైభవాన్ని పూర్తిగా అవలోకన చేసి జీర్ణించుకున్నట్టివారు. దాశరధి గారి కృతులు చదువుతుంటే భావనలోను,భావప్రకటనలోను ఇంత వైవిద్యం ఉన్న కవులు మరొకరు లేరు అనిపిస్తుంది నాకు. "కంటికి కనిపించినదంతా - కైతగా రాసేస్తున్నాను.... నావి యక్సు - కిరణాల కళ్ళేమో! - నాకేం తెలుసు, లోకమా? కంటికి కనిపించినదంతా - కైతగా రాసేస్తున్నాను" అన్న దాశరధిగారు మహాకవులు. ఇదీ అదీ కాకుండా, విస్వాన్నంతా తన హృదయంలోకి పీల్చుకొని పోగలరు. అగ్నిసెగలను, మమతలను, మానవతను బయటకు ఉదగలిగిన ప్రతిభావంతులు. వారు అపారమైన సృజన శక్తీ కలిగిన సృష్టికర్తలు. తమ సృజన శక్తీ విశృంఖలంగా ఉద్దీపించ జేసుకోగలిగిన ధీమంతులు దాశరధిగారు. - త్రిపురనేని గోపీచంద్ ఇందులో మహాకవి జక్కన (నవల) వ్యాసపీటం నవమి (9 నాటికలు) అద్దాల మేడ (అంగపూడి రమేష్ చౌదరి గారి హిందీ నవలకు అనువాదం)
© 2017,www.logili.com All Rights Reserved.