జానకిగారు విషాదంత నాటకాలకు నేపథ్యం చక్కగా వివరించారు. ఉపోద్ఘాతంలో భరతముని మొదలు ఆధునిక నాటక రచయితల వరకు చెప్పిన నాటక లక్షణాలను ప్రస్తావించారు, భారతీయ సంస్కృతీ రక్షణయే దీక్షగా గ్రంథ రచన కావించిన విశ్వనాథ పాశ్చాత్య నాటక రీతులను సోదాహరణంగా, సోప పత్తికంగా ప్రస్తావించారు. ఆమెలో పరిశోధనా తృష్ణ ఉంది. ఎం ఎ చదివి చదువు పూర్తి అయిపోయిందనుకునే ఈ రోజుల్లో నిరంతర పరిశోధనా కృషితో నాలుగు దశాబ్దాలుగా పరుగులు తీస్తున్న సాహితీ విశ్లేషకురాలు ఆమె.
ఈ గ్రంథంలో భారతీయ గ్రీకు నాటక సిద్ధాంత పరిచయ ప్రకరణలో ప్రాచ్య పాశ్చాత్య నాటక విశేషాల సోదాహరణాత్మక వివరణ చేశారు. చెప్పినతీరు, చూపిన ఉపపత్తులు, చెప్పడంలో ఒడుపు పాఠకుణ్ణి ముందుకు నడిపిస్తాయి. పరిశోధకుడికి ముడిసరుకునందిస్తూ కరదీపికగా ఉపకరిస్తాయి. ఎందరెందరో ఆంగ్ల నాటక లక్షణీకులు చెప్పిన వివరాలు పరిశోధించి, పరిశీలించి అందించారు. నాటకంలో నాయకుడు ఎలా ఉండాలి? విషాద నాయకుని లక్షణాలేమిటి? అరిస్టాటిల్ చెప్పిన లక్షణాలు చెబుతూ భరతముని చెప్పిన విలక్షణతలతో పోల్చి చూపారు.
- డా ఆర్ అనంత పద్మనాభరావు
జానకిగారు విషాదంత నాటకాలకు నేపథ్యం చక్కగా వివరించారు. ఉపోద్ఘాతంలో భరతముని మొదలు ఆధునిక నాటక రచయితల వరకు చెప్పిన నాటక లక్షణాలను ప్రస్తావించారు, భారతీయ సంస్కృతీ రక్షణయే దీక్షగా గ్రంథ రచన కావించిన విశ్వనాథ పాశ్చాత్య నాటక రీతులను సోదాహరణంగా, సోప పత్తికంగా ప్రస్తావించారు. ఆమెలో పరిశోధనా తృష్ణ ఉంది. ఎం ఎ చదివి చదువు పూర్తి అయిపోయిందనుకునే ఈ రోజుల్లో నిరంతర పరిశోధనా కృషితో నాలుగు దశాబ్దాలుగా పరుగులు తీస్తున్న సాహితీ విశ్లేషకురాలు ఆమె. ఈ గ్రంథంలో భారతీయ గ్రీకు నాటక సిద్ధాంత పరిచయ ప్రకరణలో ప్రాచ్య పాశ్చాత్య నాటక విశేషాల సోదాహరణాత్మక వివరణ చేశారు. చెప్పినతీరు, చూపిన ఉపపత్తులు, చెప్పడంలో ఒడుపు పాఠకుణ్ణి ముందుకు నడిపిస్తాయి. పరిశోధకుడికి ముడిసరుకునందిస్తూ కరదీపికగా ఉపకరిస్తాయి. ఎందరెందరో ఆంగ్ల నాటక లక్షణీకులు చెప్పిన వివరాలు పరిశోధించి, పరిశీలించి అందించారు. నాటకంలో నాయకుడు ఎలా ఉండాలి? విషాద నాయకుని లక్షణాలేమిటి? అరిస్టాటిల్ చెప్పిన లక్షణాలు చెబుతూ భరతముని చెప్పిన విలక్షణతలతో పోల్చి చూపారు. - డా ఆర్ అనంత పద్మనాభరావు© 2017,www.logili.com All Rights Reserved.