ప్రభల జానకిగారు నిరంతర పరిశోధకురాలు. వీరి సాహితీవ్యాసంగం పదవులో బిరుదులో కోరి చేస్తున్నది కాదు. కేవలం అభిరుచితోనూ, సాహిత్యం పట్ల అభిమానంతోనూ చేస్తున్నది. అందుకని ఎంత అభినందించినా తక్కువే. ఈ గ్రంథాన్ని చూడండి. మహాభారతాన్ని ఆపోశన పడితే తప్ప సాధ్యం కానిది. ప్రసిద్ధ పాత్రలతో సరిపెట్టారా! లేదు. నామమాత్రంగా ప్రసక్తమైన పాత్రలను సైతం వదలలేదు. పర్వాలవారీగా ప్రతి స్త్రీ పాత్రనూ అనుశీలించారు. వారి వ్యక్తిత్వాన్నీ, వారినుంచి గ్రహించవలసిన సామయికాంశాన్ని క్లుప్తంగా మన ముందు ఉంచారు.
ఈనాటి సామాజిక శాస్త్రాలు కలిగించిన అవగాహనతో పురాణ గాథలను నవీకరించీ, మానవీకరించీ నవలలుగా అందించే ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులివి. ఈ నేపథ్యంలోనే జానకిగారు స్త్రీపాత్రలను అనుశీలించడం అభినందించదగిన అంశం. దీనికి ఉపబలకంగా వీరివి రెండు మూడు వాక్యాలు ఉదహరిస్తాను - జానకిగారి ఆధునిక చేతన - అంతరిక వేదన అర్థమవుతుంది.
"దీర్ఘతముని శాపానంతరం స్త్రీలకు ఈ 'దుర్గతి' పట్టినట్లు తెలుస్తోంది. నన్నయాదులు ముగ్గురూ వారు నివసించిన కాలంలో సంఘంలో వచ్చిన మార్పులను అనుసరించి స్త్రీపాత్రల నిర్మాణం కావించారు. నిశితంగా పరిశీలిస్తే చిన్న చిన్న తేడాలతో పేర్ల మార్పుతో ఆ వ్యవస్థకు సమీపంలోనే మనం బ్రతుకుతున్నామనిపిస్తుంది." మరోసారి జానకిగారిని అభినందిస్తూ..
- బేతవోలు రామబ్రహ్మం
ప్రభల జానకిగారు నిరంతర పరిశోధకురాలు. వీరి సాహితీవ్యాసంగం పదవులో బిరుదులో కోరి చేస్తున్నది కాదు. కేవలం అభిరుచితోనూ, సాహిత్యం పట్ల అభిమానంతోనూ చేస్తున్నది. అందుకని ఎంత అభినందించినా తక్కువే. ఈ గ్రంథాన్ని చూడండి. మహాభారతాన్ని ఆపోశన పడితే తప్ప సాధ్యం కానిది. ప్రసిద్ధ పాత్రలతో సరిపెట్టారా! లేదు. నామమాత్రంగా ప్రసక్తమైన పాత్రలను సైతం వదలలేదు. పర్వాలవారీగా ప్రతి స్త్రీ పాత్రనూ అనుశీలించారు. వారి వ్యక్తిత్వాన్నీ, వారినుంచి గ్రహించవలసిన సామయికాంశాన్ని క్లుప్తంగా మన ముందు ఉంచారు. ఈనాటి సామాజిక శాస్త్రాలు కలిగించిన అవగాహనతో పురాణ గాథలను నవీకరించీ, మానవీకరించీ నవలలుగా అందించే ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులివి. ఈ నేపథ్యంలోనే జానకిగారు స్త్రీపాత్రలను అనుశీలించడం అభినందించదగిన అంశం. దీనికి ఉపబలకంగా వీరివి రెండు మూడు వాక్యాలు ఉదహరిస్తాను - జానకిగారి ఆధునిక చేతన - అంతరిక వేదన అర్థమవుతుంది. "దీర్ఘతముని శాపానంతరం స్త్రీలకు ఈ 'దుర్గతి' పట్టినట్లు తెలుస్తోంది. నన్నయాదులు ముగ్గురూ వారు నివసించిన కాలంలో సంఘంలో వచ్చిన మార్పులను అనుసరించి స్త్రీపాత్రల నిర్మాణం కావించారు. నిశితంగా పరిశీలిస్తే చిన్న చిన్న తేడాలతో పేర్ల మార్పుతో ఆ వ్యవస్థకు సమీపంలోనే మనం బ్రతుకుతున్నామనిపిస్తుంది." మరోసారి జానకిగారిని అభినందిస్తూ.. - బేతవోలు రామబ్రహ్మం© 2017,www.logili.com All Rights Reserved.