స్త్రీ జీవితం వృధా కుసుమంగా నేలరాలిపోకుండా కుసుమించి విజయపధం వైపు దూసుకుపోవాలనే కాంక్షతో రచయిత్రి రాసిన కవితా సంపుటి ఇది. ఇందులో 45 కవితలు పలు పత్రికల్లో వచ్చినవే.
ఎంతో మంది స్త్రీల స్వప్నాలు మొగ్గలుగానే రాలిపోవడం విషాదకరం. అలా కాకుండా స్వప్నాలు కుసుమించి విజయపధం వైపు సాగి పోవాలన్నా తపనతో ఈ సంపుటిని వేలువరిస్తున్నాను.
- తమిరిశ జానకి
సంస్కారాన్ని నిలువునా పాతేసి
నిలబడి అందుమీద,
నీతిని అవినీతికి పోట్లంలా చుట్టి
పోట్టపగిలేలా తిని
పొట్లాన్ని విసిరి పారేసిన
అహంకారపు తెరలు తొలిగించి
మనసు లోతుల్లోకి
తొంగి చూసే అలోచనేది నీకు ?
ఉరిమి ఉరిమి చూడకు జనాన్ని
ఊరుకోరు!
...................
స్త్రీ జీవితం వృధా కుసుమంగా నేలరాలిపోకుండా కుసుమించి విజయపధం వైపు దూసుకుపోవాలనే కాంక్షతో రచయిత్రి రాసిన కవితా సంపుటి ఇది. ఇందులో 45 కవితలు పలు పత్రికల్లో వచ్చినవే. ఎంతో మంది స్త్రీల స్వప్నాలు మొగ్గలుగానే రాలిపోవడం విషాదకరం. అలా కాకుండా స్వప్నాలు కుసుమించి విజయపధం వైపు సాగి పోవాలన్నా తపనతో ఈ సంపుటిని వేలువరిస్తున్నాను. - తమిరిశ జానకి సంస్కారాన్ని నిలువునా పాతేసి నిలబడి అందుమీద, నీతిని అవినీతికి పోట్లంలా చుట్టి పోట్టపగిలేలా తిని పొట్లాన్ని విసిరి పారేసిన అహంకారపు తెరలు తొలిగించి మనసు లోతుల్లోకి తొంగి చూసే అలోచనేది నీకు ? ఉరిమి ఉరిమి చూడకు జనాన్ని ఊరుకోరు! ...................© 2017,www.logili.com All Rights Reserved.