'అమ్మా! నేనొకటి అడుగుతాను అది చెప్పు. నేను అమ్మమ బామ్మల దగ్గరికి వెళ్ళి వస్తుండడం నీకు ఇష్టమైనా కదా"
"ఎందుకుఇష్టంలేదు? ఇష్టమే."
"నాక్కూడా ఇష్టం కాబట్టే వెళ్తున్నాను కదా!"
"దానికి నేను అడిగిన ప్రశ్నకి సంబంధం ఏమిటి రమా?"
"సంబంధం ఉందమ్మా. నేనిక్కడ బడిలో, ఇంట్లో కూడా మీతో ఇంగ్లీషులోనే అయితే ఇంక మన ఊరెళ్ళినప్పుడు అమ్మమ బామ్మా నన్ను నోరెళ్ళబెట్టుకుని చూస్తుండిపోతారే తప్ప నాతో కలివిడిగా కబుర్లు కథలు చెప్తారా? నా ఇంగ్లిష్ వాళ్ళకి అర్ధంకాక వాళ్ళ తెలుగు నాకు అర్ధకాక మా మధ్య దూరం పెరిగిపోయి నాకు ఆ ఊరు వెళ్ళాలన్న కొరికే ఉండదు కాదమ్మా.ధారాళంగా నేను తెలుగు మాట్లాడగలిగితేనే వాళ్ళ కబుర్లు నాకు నచ్చుతాయి కదా! అప్పుడే వాళ్ళు కూడా నాతో చనువుగా సంతోషంగా ఉండగలుగుతారు. అవును కదా చెప్పమ్మా?"
కూతుర్ని దగ్గరికి తీసుకుని పొదివిపట్టుకున్న లత కళ్ళల్లో తడి మెరిసింది. తనలాంటి మహిళలకి తాను చెప్పవలసింది చాలా ఉందని అనిపించింది. మాతృబాషకి దూరంచేసి పెద్దలు చూపించే సహజమైన ఆప్యాయత ఆ పేక్షలని పిల్లలకి దూరం చెయ్యద్దని చెప్పాలని నిశ్చయించుకుంది. -తమిరిశ జానకి.