కులం, వర్గం, జాతి లక్షణాలను, శీలాస్వభావాలను లోతుగా ఆకళింపు చేసుకున్న రచయిత చాసో. ఆయన కథలు మానవశీల స్వభావ శాస్త్రాన్ని జనజీవనం నుండి అధ్యయనం చేసి రాసినవి. Cultural Ethos ఆయన గుండె నిండా నిండి ఉంది. ఈ సాంస్కృతిక ఈథోస్ వల్ల ఆయన కథల్లో మాండలిక పదాలు, నుడికారం, పలుకుబళ్ళు ఎంతో సహజంగా జీవిత సత్యాలను, సామాజిక సత్యాలను వెల్లడించాయి. ఆ భాషా సంపదతో చాసో తన కథకే ఓ యాసని ఇవ్వగలిగారు.
భాషా సంస్కృతులు మొత్తం ఆంద్రదేశం అంతటివీ అయినప్పటికీ ప్రాంత ప్రాంతానికీ పలుకుబడిలో తేడా ఉంటుంది. విజయనగరం ప్రాంతపు భాషా సౌందర్యం తెలుగుజాతి అంతటికీ చెందిన తెలుగు సంపద. ఇక్కడి పలుకుబడి సొగసుని మిగిలిన ప్రాంతాలకి తెలియజేసి పదకోశం రూపొందించడం జరిగింది. భాషా సాహిత్యాల యువ పరిశోధకులకూ, అధ్యయనపరులకు ఈ పద సూచిక ఉపకరించాలి. 'పలికే పలుకులు' తరతరాలకు అందాలి. అదీ మా ఆకాంక్ష.
కులం, వర్గం, జాతి లక్షణాలను, శీలాస్వభావాలను లోతుగా ఆకళింపు చేసుకున్న రచయిత చాసో. ఆయన కథలు మానవశీల స్వభావ శాస్త్రాన్ని జనజీవనం నుండి అధ్యయనం చేసి రాసినవి. Cultural Ethos ఆయన గుండె నిండా నిండి ఉంది. ఈ సాంస్కృతిక ఈథోస్ వల్ల ఆయన కథల్లో మాండలిక పదాలు, నుడికారం, పలుకుబళ్ళు ఎంతో సహజంగా జీవిత సత్యాలను, సామాజిక సత్యాలను వెల్లడించాయి. ఆ భాషా సంపదతో చాసో తన కథకే ఓ యాసని ఇవ్వగలిగారు. భాషా సంస్కృతులు మొత్తం ఆంద్రదేశం అంతటివీ అయినప్పటికీ ప్రాంత ప్రాంతానికీ పలుకుబడిలో తేడా ఉంటుంది. విజయనగరం ప్రాంతపు భాషా సౌందర్యం తెలుగుజాతి అంతటికీ చెందిన తెలుగు సంపద. ఇక్కడి పలుకుబడి సొగసుని మిగిలిన ప్రాంతాలకి తెలియజేసి పదకోశం రూపొందించడం జరిగింది. భాషా సాహిత్యాల యువ పరిశోధకులకూ, అధ్యయనపరులకు ఈ పద సూచిక ఉపకరించాలి. 'పలికే పలుకులు' తరతరాలకు అందాలి. అదీ మా ఆకాంక్ష.© 2017,www.logili.com All Rights Reserved.