తెలుగు వచనానికి కండబలం, గుండెబలం యిచ్చిన రచయితల్లో శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు గణనీయులు, ఆధునిక తెలుగుకథకు గురుజాడ జీవం పోస్తే తరువాత తరంలోని శ్రీపాద వారు దానికి జవం కలిగించారు.
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు జగము ఎరిగినవాడు; జగము తన్నెరిగినవాడు. వారు రాసిన 75 సామజిక కథల్లో తెలుగు కుటుంబాల ఆపేక్ష... అంతఃకరణలు ఎలాంటివో ఆ మరియాదలు, మన్ననలు ఎట్టివో అర్థమవుతుంది! ఆశ్చర్యమేస్తుంది! ముచ్చటౌతుంది. వచన రచనకు పెట్టింది పేరు వారి వాక్యం. ఇవే మా తెలుగు కథలంటూ తెలుగు వాళ్ళు గర్వించదగిన కథల నందించిన ఘనాపాఠీ మన శ్రీపాద గారు.
వీరు రామాయణం, భారతం (4 పర్వాలు), మహాభక్త విజయం, దేవవాణీ సుభాషితాలు, చాణక్య నీతిసూత్రాలు; పురాణ గాథలు - మొదలగు గ్రంథాలు రాశారు.
నాకు పురాణ గాథలు ద్వితీయ సంపుటి 2013 లో లభించగా పురాణ నీతి గాథలు పేరుతో ప్రచురించాను. ఇప్పుడు మానస ఫౌండేషన్స్ శ్రీ రాముడు గారు పురాణ గాథలు మొదటి సంపుటి జిరాక్స్ పంపారు. వారికి నా ధన్యవాదాలు. ప్రారంభించిన పని పూర్తి చేయాలనే శ్రద్ధతో అందులోని 38 గాథలకు మరి 2 గాథలు చేర్చి మొత్తం 40 గాథలతో అక్కడక్కడ బొమ్మలతో '40 పురాణ నీతి గాథలు' పేరుతో ఈ పుస్తకం మీకు అందిస్తున్నాను. ఇందులో శ్రీ పాద వారి రచనలను పాఠకులకు అందించాలనే తపన తప్ప లాభా పేక్ష ఎంత మాత్రమూ లేదు.
- శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి