శ్రుతి అంటే వేదం. స్మృతి అంటే ధర్మశాస్త్రం. ఇది వేదంతో సమానమై పదునాలుగు విద్యల్లో ఒకటైంది. ధర్మశాస్త్రం ధర్మాన్ని తెలుపుతుంది. వ్యక్తి చేయగలిగిన విధుల్ని బోధించేది ధర్మం. ధర్మాలు సామాన్యమనీ, విశేషమనీ రెండు రకాలు. సత్యం, అహింస, దయ, శౌచం మొదలయినవన్నీ సామాన్య ధర్మాలు. వర్ణాశ్రమ ధర్మాలు విశేష ధర్మాలు.
భారతదేశంలో ధర్మ శాస్త్రాలు చాలా ప్రాచీనమయినట్టివి. మానవ సమాజంతోనే సామాన్య విశేష ధర్మాలు రూపొందాయి. వేదాలలో ధర్మశాస్త్ర సంబంధి అంశాలు కొన్ని కనబడుతున్నాయి. సమాజం స్థాణువు కాదు కాబట్టి, పరిణామం చెందే తత్వం కలిగింది. కావున ధర్మాలను కూడా కాలానుగుణంగా మార్పులు చేర్పులతో తిరిగి నిర్ణయించుకోవడం తప్పనిసరయింది. ఈ విధంగానే ధర్మసూత్రాలు అవతరించాయి.
భారతదేశంలో దాదాపు ముప్పై అయిదు ప్రధాన స్మృతులున్నాయి. వీటిల్లో మనుస్మృతి అగ్రగణ్యం. మనుస్మృతి అనగానే మనువు రచించిన స్మృతి అని సాహిత్యపరుస కెవరికైనా అర్ధమవుతుంది. అయితే ఈ మనువెవ్వరో నిర్ణయించడం దుస్సాధ్యము. పురాణాల ప్రకారం పద్నాలుగు మనువులు గోచరిస్తారు. వీరిలో మొదటివాడు బ్రహ్మ పుత్రుడైన స్వాయంభువ మనువు. ఇతని సంతతివారే మానవులు.
ఇది మను వృత్తా౦తం. మనుస్మృతి వర్ణ ధర్మాలూ, ఆశ్రమ ధర్మాలూ, ధర్మ నిర్ణయాలూ, అభియోగ విచారణమూ వివిధ దండన విధానాలూ, రాజ్య సంబంధ విషయాలూ మొదలైన వాటిని విపులంగా వ్యవహరిస్తుంది. నామకరణం, బిక్షాటన౦ మొదలైన విషయాల్లో మనుస్మృతి తీరు విచిత్రంగా నిరంకుశంగా గోచరిస్తుంది. ఈనాడు ఈ అనువాదం ఎంతయినా ఉపయోగకారి అవుతుంది.భారతీయ సంస్కృతి మంచి సెబ్బరలను తెలిసికొని దేశంలో విచ్చల విడిగా పెచ్చు పెరిగి తిరుగుతున్న దుష్టశక్తుల త్రుళ్ళు అణచివేయడానికి, అసమానత్వాలను నామరూపాలు లేకుండా నశి౦పజేయడానికి ఈ ఎనభై ఎనిమిది పేజీల గ్రంథం తప్పకుండా తోడ్పడుతుంది - దీన్ని చదివే వారికి.
- నాగళ్ల గురు ప్రసాదరావు
శ్రుతి అంటే వేదం. స్మృతి అంటే ధర్మశాస్త్రం. ఇది వేదంతో సమానమై పదునాలుగు విద్యల్లో ఒకటైంది. ధర్మశాస్త్రం ధర్మాన్ని తెలుపుతుంది. వ్యక్తి చేయగలిగిన విధుల్ని బోధించేది ధర్మం. ధర్మాలు సామాన్యమనీ, విశేషమనీ రెండు రకాలు. సత్యం, అహింస, దయ, శౌచం మొదలయినవన్నీ సామాన్య ధర్మాలు. వర్ణాశ్రమ ధర్మాలు విశేష ధర్మాలు. భారతదేశంలో ధర్మ శాస్త్రాలు చాలా ప్రాచీనమయినట్టివి. మానవ సమాజంతోనే సామాన్య విశేష ధర్మాలు రూపొందాయి. వేదాలలో ధర్మశాస్త్ర సంబంధి అంశాలు కొన్ని కనబడుతున్నాయి. సమాజం స్థాణువు కాదు కాబట్టి, పరిణామం చెందే తత్వం కలిగింది. కావున ధర్మాలను కూడా కాలానుగుణంగా మార్పులు చేర్పులతో తిరిగి నిర్ణయించుకోవడం తప్పనిసరయింది. ఈ విధంగానే ధర్మసూత్రాలు అవతరించాయి. భారతదేశంలో దాదాపు ముప్పై అయిదు ప్రధాన స్మృతులున్నాయి. వీటిల్లో మనుస్మృతి అగ్రగణ్యం. మనుస్మృతి అనగానే మనువు రచించిన స్మృతి అని సాహిత్యపరుస కెవరికైనా అర్ధమవుతుంది. అయితే ఈ మనువెవ్వరో నిర్ణయించడం దుస్సాధ్యము. పురాణాల ప్రకారం పద్నాలుగు మనువులు గోచరిస్తారు. వీరిలో మొదటివాడు బ్రహ్మ పుత్రుడైన స్వాయంభువ మనువు. ఇతని సంతతివారే మానవులు. ఇది మను వృత్తా౦తం. మనుస్మృతి వర్ణ ధర్మాలూ, ఆశ్రమ ధర్మాలూ, ధర్మ నిర్ణయాలూ, అభియోగ విచారణమూ వివిధ దండన విధానాలూ, రాజ్య సంబంధ విషయాలూ మొదలైన వాటిని విపులంగా వ్యవహరిస్తుంది. నామకరణం, బిక్షాటన౦ మొదలైన విషయాల్లో మనుస్మృతి తీరు విచిత్రంగా నిరంకుశంగా గోచరిస్తుంది. ఈనాడు ఈ అనువాదం ఎంతయినా ఉపయోగకారి అవుతుంది.భారతీయ సంస్కృతి మంచి సెబ్బరలను తెలిసికొని దేశంలో విచ్చల విడిగా పెచ్చు పెరిగి తిరుగుతున్న దుష్టశక్తుల త్రుళ్ళు అణచివేయడానికి, అసమానత్వాలను నామరూపాలు లేకుండా నశి౦పజేయడానికి ఈ ఎనభై ఎనిమిది పేజీల గ్రంథం తప్పకుండా తోడ్పడుతుంది - దీన్ని చదివే వారికి. - నాగళ్ల గురు ప్రసాదరావు© 2017,www.logili.com All Rights Reserved.