సినిమాల్లో పాటలా? ఎంత అసంబద్ధం! ఎంత అవాస్తవికం అనే వాళ్ళతో వాదించడం కోసమని కాదుకానీ, మనిషి జీవితంలో ఆటపాటలున్నప్పుడు, మానవ జీవితానికి కావలసిన వినోదాన్ని సినిమా అందిస్తున్నప్పుడు, ఆ సినిమాలో పాటకు ఎందుకు స్థానం ఉండదు. ఉండకూడదు? అన్నదే ఇక్కడి ప్రశ్న! ఒకప్పుడు కవుల్ని ఇలాంటి మీమాంసాలు వెంటాడి ఉంటే వారి కావ్యాల్లో పాత్రలు చందోబద్దంగా మాట్లాడుకునేవి కావేమో? రంగస్థల నాటకాల్లోని పాత్రలు జెండాపై కపిరాజు లాంటి పద్యాల్ని ఎలుగెత్తి చాటేవి కావేమో? మీర జాలగలడా? అని సత్యభామ, పోవుచున్నావా యమధర్మరాజ.. అని సావిత్రి స్వరలయలకు అభినయాన్ని జోడించి ఉండేవారు కాదేమో? ప్రదర్శన మధ్యమంలోని ప్రతీ అంశం పద్యంతోనో, పాటతోనో పెనవేసుకుని ప్రేక్షకుల్ని అలరించిన మాట యదార్థం! అందుకే మాటల్లాగా, ద్రుశ్యాల్లాగా పాటలు కూడా సినిమాల్లో ఒక భాగంగా ప్రేక్షకులు స్వీకరించారు.
- మాటూరి సూరిబాబు
ఈ పుస్తకంలోని పాటలకు నేను రాసిన విశ్లేషణలు వగైరా - ఆయా పాటలు వింటున్నప్పుడు నాలో కలిగిన స్పందనలు, నాకు తెలిసిన, నేను సేకరించిన విషయాలు.. అంతేగానీ తెలుగు సినిమా పాటల మీద పనిగట్టుకుని చేసిన విస్తృత పరిశోధన కాదు. ఆ రోజుల్లో విడుదలైన సినిమాల్లో కొన్నిట్లో నాకు నచ్చిన, అవగాహన ఉన్న కొన్ని పాటల్ని తీసుకుని వాటి గురించి నాకు తెలిసిన విషయాలను కలగలుపుతూ సినీసంగీతాభిమానులను అలరించడానికి చేసిన ఓ ప్రయత్నం ఇది.
- రాజా
సినిమాల్లో పాటలా? ఎంత అసంబద్ధం! ఎంత అవాస్తవికం అనే వాళ్ళతో వాదించడం కోసమని కాదుకానీ, మనిషి జీవితంలో ఆటపాటలున్నప్పుడు, మానవ జీవితానికి కావలసిన వినోదాన్ని సినిమా అందిస్తున్నప్పుడు, ఆ సినిమాలో పాటకు ఎందుకు స్థానం ఉండదు. ఉండకూడదు? అన్నదే ఇక్కడి ప్రశ్న! ఒకప్పుడు కవుల్ని ఇలాంటి మీమాంసాలు వెంటాడి ఉంటే వారి కావ్యాల్లో పాత్రలు చందోబద్దంగా మాట్లాడుకునేవి కావేమో? రంగస్థల నాటకాల్లోని పాత్రలు జెండాపై కపిరాజు లాంటి పద్యాల్ని ఎలుగెత్తి చాటేవి కావేమో? మీర జాలగలడా? అని సత్యభామ, పోవుచున్నావా యమధర్మరాజ.. అని సావిత్రి స్వరలయలకు అభినయాన్ని జోడించి ఉండేవారు కాదేమో? ప్రదర్శన మధ్యమంలోని ప్రతీ అంశం పద్యంతోనో, పాటతోనో పెనవేసుకుని ప్రేక్షకుల్ని అలరించిన మాట యదార్థం! అందుకే మాటల్లాగా, ద్రుశ్యాల్లాగా పాటలు కూడా సినిమాల్లో ఒక భాగంగా ప్రేక్షకులు స్వీకరించారు. - మాటూరి సూరిబాబు ఈ పుస్తకంలోని పాటలకు నేను రాసిన విశ్లేషణలు వగైరా - ఆయా పాటలు వింటున్నప్పుడు నాలో కలిగిన స్పందనలు, నాకు తెలిసిన, నేను సేకరించిన విషయాలు.. అంతేగానీ తెలుగు సినిమా పాటల మీద పనిగట్టుకుని చేసిన విస్తృత పరిశోధన కాదు. ఆ రోజుల్లో విడుదలైన సినిమాల్లో కొన్నిట్లో నాకు నచ్చిన, అవగాహన ఉన్న కొన్ని పాటల్ని తీసుకుని వాటి గురించి నాకు తెలిసిన విషయాలను కలగలుపుతూ సినీసంగీతాభిమానులను అలరించడానికి చేసిన ఓ ప్రయత్నం ఇది. - రాజా© 2017,www.logili.com All Rights Reserved.