రాజా నరసింహ తన నియాం పురం నవల ద్వారా జీవితాన్నీ, వారి పోరాటాన్నీ ఒక సరికొత్త ప్రాసంగికతతో మనముందు చూపిస్తున్నాడు. గోపీనాథ మొహంతి నవల “అమృత సంతానం” లానే ఈ నవల కూడా గిరిజన జీవితాన్ని ఐతిహాసిక ప్రమాణాల్తో చిత్రించడానికి ప్రయత్నించింది. పుట్టుక, పెళ్ళి, చావు, పూజ, బలి, వియ్యం, కయ్యం - ఒక సమాజాన్ని చిత్రించడానికి అవసరమైన ఏ ఒక్క పార్శ్వాన్నీ రచయిత విడిచిపెట్టలేదు. గిరిజన జీవితంలో ఏడాది పొడుగునా నడిచే క్రతుకాండ, సంబరాలు, ఉత్సాహం, వేడుకలు వేటినీ రచయిత వదల్లేదు. సంతలు, దోపిడీ, వడ్డీ, వెట్టి, అణచివేత, తిరుగుబాటు- గిరిజన జీవితాన్ని ప్రతిబింబించే ఏ సందర్భాన్నీ రచయిత పక్కన పెట్టలేదు. చివరికి తాను కళ్ళతో చూసినదాన్ని పూర్తిగా తిరగమార్చి తప్పుడు కథనాలు రాసి పంపించే విలేకరితో సహా గిరిజన ప్రాంతంలో మనకి కనబడేవాడేవడూ ఇందులో కనబడకుండాపోడు.
అలాగని ఈ నవలను అమృతసంతానానికి అనుకరణగా చెప్పలేను. అమృతసంతానం ఎక్కడ ఆగిపోయిందో ఈ నవల అక్కడ మొదలవుతున్నది. ఇంకా చెప్పాలంటే, ఈ నవలని 21వ శతాబ్దపు అమృత సంతానంగా అభివర్ణించవచ్చు. నియాం పురం నవలని రెండు చేతులూ చాచిమరీ స్వాగతిస్తున్నాను........................
రాజా నరసింహ తన నియాం పురం నవల ద్వారా జీవితాన్నీ, వారి పోరాటాన్నీ ఒక సరికొత్త ప్రాసంగికతతో మనముందు చూపిస్తున్నాడు. గోపీనాథ మొహంతి నవల “అమృత సంతానం” లానే ఈ నవల కూడా గిరిజన జీవితాన్ని ఐతిహాసిక ప్రమాణాల్తో చిత్రించడానికి ప్రయత్నించింది. పుట్టుక, పెళ్ళి, చావు, పూజ, బలి, వియ్యం, కయ్యం - ఒక సమాజాన్ని చిత్రించడానికి అవసరమైన ఏ ఒక్క పార్శ్వాన్నీ రచయిత విడిచిపెట్టలేదు. గిరిజన జీవితంలో ఏడాది పొడుగునా నడిచే క్రతుకాండ, సంబరాలు, ఉత్సాహం, వేడుకలు వేటినీ రచయిత వదల్లేదు. సంతలు, దోపిడీ, వడ్డీ, వెట్టి, అణచివేత, తిరుగుబాటు- గిరిజన జీవితాన్ని ప్రతిబింబించే ఏ సందర్భాన్నీ రచయిత పక్కన పెట్టలేదు. చివరికి తాను కళ్ళతో చూసినదాన్ని పూర్తిగా తిరగమార్చి తప్పుడు కథనాలు రాసి పంపించే విలేకరితో సహా గిరిజన ప్రాంతంలో మనకి కనబడేవాడేవడూ ఇందులో కనబడకుండాపోడు. అలాగని ఈ నవలను అమృతసంతానానికి అనుకరణగా చెప్పలేను. అమృతసంతానం ఎక్కడ ఆగిపోయిందో ఈ నవల అక్కడ మొదలవుతున్నది. ఇంకా చెప్పాలంటే, ఈ నవలని 21వ శతాబ్దపు అమృత సంతానంగా అభివర్ణించవచ్చు. నియాం పురం నవలని రెండు చేతులూ చాచిమరీ స్వాగతిస్తున్నాను........................© 2017,www.logili.com All Rights Reserved.