అక్కినేని చరిత్ర కాస్త యించుమించుగా తెలుగు టాకీల చరిత్రే .
తెరమీదే కాదు, పుస్తకాల విషయంలోనూ ఆయనదే "లీడ్ రోల్". ఆయనమీద వచ్చినన్ని పుస్తకాల మరే యితర నటుడి పైన రాలేదు. మిత్రులు ఎస్.వి.రామారావుగారు అక్కినేనిని ఆలంబనగా చేసుకుని 64మంది కధానాయికలను, కధలను మనకు చెప్తున్నారు. ఇది ఎంతో అభిలషణియం. ఎందుకంటే అందరికీ అక్కినేనికి పట్టిన అదృష్టం పట్టదు.
ఎకడమీషియన్లు గుర్తించినా గుర్తించకపోయినా యిది ఒక గొప్ప కృషి. ఇతర దేశాలలో చరిత్రను నిక్షిప్తం చేసుకోవడానికి ఎంతో శ్రమిస్తున్నారు.మనం మన సంస్కృతిని విస్మరిస్తున్నాం. రికార్డు చేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇంకో పదేళ్ళు గడిచాక తీరిగ్గా రికార్డు చేసుకుందామంటే అప్పుడు దొరుకుతుందా! దొరికిన అరకొర సమాచారంలో గుణదోషాలు చెప్పగల వారు జీవితులై వుంటారా!జీవించివున్నా వారి జ్ఞాపకశక్తి యధాతధంగా వుంటుందా!
సమాచారం సేకరించి, పదిలపరచడం ఒక యేత్తయితే, దాన్నిజనరంజకంగా అందించడం మరో యేత్తు.
రామారావుగారు ఓ లక్షణమైన పద్ధతి అవలంబించారు.సినిమాలకంటే వాటి పాటల ఆయుప్రమాణం ఎక్కువ - వ్యాప్తి అందుబాటు సులభం కాబట్టి! అందువలన ఆ హిరోయిన్లు ముచ్చట్లు వారు పాడిన పాటలద్వారా చెప్పారు. పాటల పల్లవులు యిచ్చి వూరుకోలేదు, వాటి పూర్వాపరాలు చెప్పారు. సినిమా కధలో అవి ఎలా యిమిడాయో చెప్పారు. అలా అని ఒకే చోట సినిమా కధ ఏకరువు పెట్టలేదు. ఇద్దరు హిరోయిన్లు వుంటే వారి వారి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ యా పాత్రలద్వారా కధను రెండు భాగాలుగా చెప్పారు. ఈ విధమైన స్కీము నేను ఎక్కడా చూడలేదు, చదవలేదు. ఈ పధ్ధతిలో దాదాపు 200సినిమాలతో మనకు రేఖామాత్ర పరిచయమైనా కలిగించారు. అంతటితో ఆగలేదు, ఆ యా హిరోయిన్ల ఫోటోల, సేకరించి ప్రచురించారు. మనకు పేరే తెలియదంటే వాళ్ళ ఫోటోలు ఎక్కడ దొరికాయో మరి!
ఎస్.వి.రామారావు
అక్కినేని చరిత్ర కాస్త యించుమించుగా తెలుగు టాకీల చరిత్రే . తెరమీదే కాదు, పుస్తకాల విషయంలోనూ ఆయనదే "లీడ్ రోల్". ఆయనమీద వచ్చినన్ని పుస్తకాల మరే యితర నటుడి పైన రాలేదు. మిత్రులు ఎస్.వి.రామారావుగారు అక్కినేనిని ఆలంబనగా చేసుకుని 64మంది కధానాయికలను, కధలను మనకు చెప్తున్నారు. ఇది ఎంతో అభిలషణియం. ఎందుకంటే అందరికీ అక్కినేనికి పట్టిన అదృష్టం పట్టదు. ఎకడమీషియన్లు గుర్తించినా గుర్తించకపోయినా యిది ఒక గొప్ప కృషి. ఇతర దేశాలలో చరిత్రను నిక్షిప్తం చేసుకోవడానికి ఎంతో శ్రమిస్తున్నారు.మనం మన సంస్కృతిని విస్మరిస్తున్నాం. రికార్డు చేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇంకో పదేళ్ళు గడిచాక తీరిగ్గా రికార్డు చేసుకుందామంటే అప్పుడు దొరుకుతుందా! దొరికిన అరకొర సమాచారంలో గుణదోషాలు చెప్పగల వారు జీవితులై వుంటారా!జీవించివున్నా వారి జ్ఞాపకశక్తి యధాతధంగా వుంటుందా! సమాచారం సేకరించి, పదిలపరచడం ఒక యేత్తయితే, దాన్నిజనరంజకంగా అందించడం మరో యేత్తు. రామారావుగారు ఓ లక్షణమైన పద్ధతి అవలంబించారు.సినిమాలకంటే వాటి పాటల ఆయుప్రమాణం ఎక్కువ - వ్యాప్తి అందుబాటు సులభం కాబట్టి! అందువలన ఆ హిరోయిన్లు ముచ్చట్లు వారు పాడిన పాటలద్వారా చెప్పారు. పాటల పల్లవులు యిచ్చి వూరుకోలేదు, వాటి పూర్వాపరాలు చెప్పారు. సినిమా కధలో అవి ఎలా యిమిడాయో చెప్పారు. అలా అని ఒకే చోట సినిమా కధ ఏకరువు పెట్టలేదు. ఇద్దరు హిరోయిన్లు వుంటే వారి వారి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ యా పాత్రలద్వారా కధను రెండు భాగాలుగా చెప్పారు. ఈ విధమైన స్కీము నేను ఎక్కడా చూడలేదు, చదవలేదు. ఈ పధ్ధతిలో దాదాపు 200సినిమాలతో మనకు రేఖామాత్ర పరిచయమైనా కలిగించారు. అంతటితో ఆగలేదు, ఆ యా హిరోయిన్ల ఫోటోల, సేకరించి ప్రచురించారు. మనకు పేరే తెలియదంటే వాళ్ళ ఫోటోలు ఎక్కడ దొరికాయో మరి! ఎస్.వి.రామారావు© 2017,www.logili.com All Rights Reserved.