విజ్ఞాన శాస్త్ర సంబంధమైన హేతుబద్దత, సాహిత్య అధ్యయనంతో అలవడిన శైలి, మీడియా ఉద్యోగంతో ఒనగూడిన అవగాహన ముప్పేటగా కలసిన పరిణతి నాగసూరి వేణుగోపాల్ మీడియా విశ్లేషణల్లో సుస్పష్టం. తెలుగులో టీవీ చానళ్లు విచ్చుకుంటున్న తొలిదశలోనే నాగసూరి బుల్లితెర కార్యక్రమాల వస్తువు, శిల్పం, ఉద్దేశం, భాష, వ్యక్తీకరణలతోపాటు సాంకేతిక విషయాలను కూడా వివరిస్తూ ఎవారానికి ఆ వారం విశ్లేషణలు కొనసాగించారు. తెలుగు టీవీ తోలి సమగ్ర విశ్లేషకులుగా టీవీ ముచ్చట్లు, చానళ్ల విస్తృతి - సీరియళ్ల వికృతి, చానళ్ల సందడి - టెక్నాలజీ హడావుడి, సమాచారం బాట - సంచలనాల వేట పుస్తకాలను వెలువరించారు. ఈ పుస్తకాలు ఇప్పటికే ఆంధ్ర విశ్వవిద్యాలయం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, కృష్ణ విశ్వవిద్యాలయం, యోగి వేమన విశ్వవిద్యాలయం ఎం. ఎ. (జర్నలిజం), ఎం. ఎ. (తెలుగు) కోర్సులకు అధ్యయన గ్రంథాలుగా ఉన్నాయి. ఇప్పుడు వెలువడుతున్న చానళ్ల హోరు - భాష తీరు, గ్రంథం తో కలసి నాగసూరి విశ్లేషణలు పుష్కరంపాటు తెలుగునాట టీవీ బాటను పత్తిచూపాయి. ఈ పుస్తకాలు జర్నలిజం విద్యార్థులకే కాకుండా వృత్తిలో కొనసాగుతున్న వారికీ కరదీపికలు.
- నాగసూరి వేణుగోపాల్