- డా నాగసూరి వేణుగోపాల్
“అప్పుడే వేసవి కాలం వచ్చేసింది. వెచ్చని వడగాడ్పు ఈ చెవిలోంచి ఆ చెవిలోకి కొడుతోంది. పది గంటలు దాటితే జనం వీధుల్లోకి రావడానికి జడుస్తున్నారు. కలవారి యిళ్ళకి వట్టివేళ్ళ తడికలు బిగింపబడ్డాయి...” ఇలా ప్రారంభమయ్యే కథానికను ఒక రచయిత తొలి కథ అని ఎవరూ భావించరు - ఆ విషయం ఎవరైనా చెబితే తప్ప! 17-18 ఏళ్ళ వయసున్న, అప్పుడప్పుడే పెళ్ళైన గ్రామీణ, ఎస్సెసెల్సి మాత్రమే చదివిన యువతి రాశారని చెబితే కానీ ఎవరూ ఆ విషయాలు ఊహించలేరు!! మనం 1957లో అచ్చయిన యద్దనపూడి సులోచనారాణి తొలి కథానిక 'చిత్రనళినీయం' గురించి చర్చించుకుంటున్నామిపుడు.
అప్పటికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్ద కాలమైంది. సుమారైన గ్రామాలకి స్కూళ్ళు, పోస్ట్ డబ్బాలు వచ్చిన పరిస్థితి. రేడియో అప్పుడప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. పత్రికలు, సినిమాలు అంతగా విచ్చుకుని, చొచ్చుకుని పోలేదు. అటువంటి కాలంలో ఉత్తరాల ఆధారంగా సాగి, కలం స్నేహంతో పెళ్ళిదాకా నడిచిన కథావస్తువు అది టెలిఫోన్ విస్తృతంగా వచ్చేదాకా, అంటే ముప్పయి, నలభయ్యేళ్ళపాటు మన్నిక గల కమ్యూనికేషన్ విధానం ఉత్తరాలు. అటువంటి అంశాన్ని ఎంపిక All చేసుకోవడంలో రచయిత్రి సార్వజనీనత, సృజన కనబడుతున్నాయి.
ఆ కథానికలో రెండు పాత్రలు చిత్ర, నళిని పేర్ల ఆధారంగా 'చిత్రనళినీయం' అని నామకరణం చేయడం కూడా అప్పటికి నవ్యతే! ధర్మవరం రామకృష్ణమాచార్యులు 1916లో రాసిన..........
సులోచనారాణి రచనలపై సహృదయతతో కూడిన పరిశోధన అవసరం! - డా నాగసూరి వేణుగోపాల్ “అప్పుడే వేసవి కాలం వచ్చేసింది. వెచ్చని వడగాడ్పు ఈ చెవిలోంచి ఆ చెవిలోకి కొడుతోంది. పది గంటలు దాటితే జనం వీధుల్లోకి రావడానికి జడుస్తున్నారు. కలవారి యిళ్ళకి వట్టివేళ్ళ తడికలు బిగింపబడ్డాయి...” ఇలా ప్రారంభమయ్యే కథానికను ఒక రచయిత తొలి కథ అని ఎవరూ భావించరు - ఆ విషయం ఎవరైనా చెబితే తప్ప! 17-18 ఏళ్ళ వయసున్న, అప్పుడప్పుడే పెళ్ళైన గ్రామీణ, ఎస్సెసెల్సి మాత్రమే చదివిన యువతి రాశారని చెబితే కానీ ఎవరూ ఆ విషయాలు ఊహించలేరు!! మనం 1957లో అచ్చయిన యద్దనపూడి సులోచనారాణి తొలి కథానిక 'చిత్రనళినీయం' గురించి చర్చించుకుంటున్నామిపుడు. అప్పటికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్ద కాలమైంది. సుమారైన గ్రామాలకి స్కూళ్ళు, పోస్ట్ డబ్బాలు వచ్చిన పరిస్థితి. రేడియో అప్పుడప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. పత్రికలు, సినిమాలు అంతగా విచ్చుకుని, చొచ్చుకుని పోలేదు. అటువంటి కాలంలో ఉత్తరాల ఆధారంగా సాగి, కలం స్నేహంతో పెళ్ళిదాకా నడిచిన కథావస్తువు అది టెలిఫోన్ విస్తృతంగా వచ్చేదాకా, అంటే ముప్పయి, నలభయ్యేళ్ళపాటు మన్నిక గల కమ్యూనికేషన్ విధానం ఉత్తరాలు. అటువంటి అంశాన్ని ఎంపిక All చేసుకోవడంలో రచయిత్రి సార్వజనీనత, సృజన కనబడుతున్నాయి. ఆ కథానికలో రెండు పాత్రలు చిత్ర, నళిని పేర్ల ఆధారంగా 'చిత్రనళినీయం' అని నామకరణం చేయడం కూడా అప్పటికి నవ్యతే! ధర్మవరం రామకృష్ణమాచార్యులు 1916లో రాసిన..........© 2017,www.logili.com All Rights Reserved.