1972 సెప్టెంబర్ 14 వ తేదీ హైద్రాబాదులోని రవీంద్ర భారతిలో ప్రముఖ సినీనటులు అందాల హీరో శ్రీ శోభన్ గారి జ్యోతి ప్రకాశనంతో శిరోమణి వంశి రామరాజుగారి సారథ్యంలో ప్రారంభమైన వంశి ఆర్ట్స్ థియేటర్స్ జ్వజ్యల్య మనంగా ప్రకాశిస్తూ 44 సంవత్సరాలు నిరంతరాయంగా అనేకవేళ కార్యక్రమాలు నిర్వహించింది. సహీత్యం సంగీతం నాటికలు సత్కారాలు...... అన్ని లెక్కకు మించి చేసింది, చేస్తున్నది. అన్ని విశిష్టమైన కార్యక్రమాలే. ఎన్నో కొత్తరకం కార్యక్రమాలకు వంశి ట్రెండ్ సెట్టర్ గా మార్గదర్శికంగా నిలిచింది. కార్యక్రమాల్లో ఎన్నో మైలురాళ్ళు. దేవులపల్లి కృష్ణశాస్త్రి నాగయ్య గార్లతో మొదల్కొని ఈనాటి ఎంతోమంది కళాకారులను సత్కరించిన ఘనత వంశీకే దక్కింది.
వంశి - బర్కీలీ అవార్డులు విశ్వఖ్యాతి పొందాయి. వంశి వేదికతో పరిచయమైనా కళాకారులు లబ్దప్రతిష్టులై వంశి వేదిక ద్వారా తమ తొలి ప్రయాణం ఆరంభమైందని చెప్పడం వంశి కెంతో గర్వకారణం. హైద్రాబాద్ లో తెలుగు రాష్ట్రాల్లోని కాక వంశి అంతర్జాతీయంగా ఎదిగి అమెరికాలో గత 8 సంవత్సరాలుగా ఘంటసాల ఆరాధనోత్సవాలు నిర్వహించడం అసాధారణమైన విషయం. వంశి విజ్ఞానపీఠం ద్వారా ఎంతోమంది సాహితీవేత్తలు సాహిత్యోపన్యోసా లిచ్చారు. ఎన్నో గ్రంధాలు ఆవిష్కరించుకున్నారు. వంశి సంస్థ ద్వారా కళాకారులకు వేదిక కలిపించడం ఒక ఎత్తయితే వేగేశ్న ఫౌండేషన్ ద్వారా వికలాంగులకు సేవ వారికి ఉచిత విద్య భోజనం ఆపరేషన్లు చేయించడం మానవత్వానికి ప్రతీకగా చెప్పవచ్చు. వంశి వృద్దాశ్రమం నెలకొల్పి వృద్దులకు సేవ చేస్తున్నారు.
- యస్ వి రమణమూర్తి, ఎలమర్తి రమణయ్య