ఒక అనవద్య పోర్ ఉద్యమపథాన్ని సువిశాలం, ఆకర్షణీయం చేసి, చైతన్య దీపుల్ని పంచి.. తెరమరుగైంది..!
ఒక యుద్ధం, ఒక సవాల్, ఒక సమర్పణ, ఒక విముక్తి
- బీబీ అముస్సలామ్ !
వికాసానికి చిరునామా, విజయానికి రహదారి
- ఆమె జీవితం!
దేశ విభజన సమయంలో.. ఒక ముస్లిం మహిళ, తన కుటుంబమంతా.. పాకిస్తాన్ కి తరలి వెళ్లిపోయినా.. తాను ఒక్కతే.. భారతదేశాన్నే ఎంచుకుని, ఇక్కడే ఉండి పోయిందనీ, మతోన్మాద పిశాచాల కరాళ మృత్యు నర్తనలో... మిలియన్ల మంది ప్రజల ప్రాణాలు ఆహుతౌతున్న కల్లోల, విషమ సమయంలో.. శాంతి కోసం, సమైక్యత కోసం ఆ మహిళే.. ఒక్కతే.. 26 రోజులు నిరాహార దీక్ష చేసిందనీ ..తెలుసుకుంటే.. నమ్మశక్యం కాదు. ఇటువంటి నమ్మశక్యం కాని సంగతులు బీబీ అముస్సలామ్ జీవితంలో ఎన్నెన్నో ఉన్నాయి..
ఒక అతిలోక సాహసం, సత్యాగ్రహ సమరాన భీషణ శౌర్య జ్వాలగా ఎగసి, ఉన్మాదాల్ని నిలువరించి.. అంతర్షితమైంది..!
ఒక అపూర్వ త్యాగం, విద్వేష నిశీధిలో మిరుమిట్లు గొలిపే తారలా మెరిసి, దిగంతాల్ని కాంతులతో నింపి.. విస్మృతమైంది..!
ఒక అనవద్య పోర్ ఉద్యమపథాన్ని సువిశాలం, ఆకర్షణీయం చేసి, చైతన్య దీపుల్ని పంచి.. తెరమరుగైంది..! ఒక యుద్ధం, ఒక సవాల్, ఒక సమర్పణ, ఒక విముక్తి
- బీబీ అముస్సలామ్ ! వికాసానికి చిరునామా, విజయానికి రహదారి