గాంధీ మహాత్ముడు మామూలుగా చూడటానికి గొప్ప అధ్యయనశీలిగా, మహా మేధావంతుడిగా అగుపించడు. కానీ.. సమకాలీన ఘటనలన్నింటి పైన.. ఆయనకి అమోఘమైన నిశితమైన పరిశీలన, తనదైన విశ్లేషణ, వివేచన ఉండేవి. వర్తమాన పరిణామాల్ని విశ్లేషించడంలో... పలు సందర్భాల్లో... అయన తన సమకాలీనుల కన్నా చాలా చాలా ముందున్నాడు. వివిధ పరిణామాలపై గాంధీజీ విశ్లేషణ సరైనదని చరిత్ర పలుమార్లు నిరూపించింది....!
రష్యాలో లెనిన్ నేతృత్వంలో విప్లవం జయప్రదమైనప్పుడు, గాంధీజీ ఆ పరిణామాన్ని సాకల్యంగా, నిశితంగా పరిశీలించాడు.
లెనిన్ స్టాలిన్ నేతృత్వంలోని బోల్షివిక్కులు, అసమ్మతికీ, వ్యక్తి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి ఎటువంటి చోటులేని ఏకపక్ష నిరంకుశ వ్యవస్థని నిర్బంధంతో బలప్రయోగంతో నిర్మిస్తున్నారని గాంధిజీ గమనించాడు....!
- విజయవిహారం రమణమూర్తి