తొలితరం హీరోలు పడమటి సంధ్యకు చేరువవుతున్న తరుణమది. రెండో తరం హీరోల కోసం అటు పరిశ్రమ, ఇటు ప్రజలు ఎదురు చూస్తున్నారు. అటువంటి నేపథ్యంలో చిరంజీవి హీరోగా ఎంటర్ కావడం ఆయనకు బాగా కలిసొచ్చిన అంశం. అయితే పరిశ్రమలో ఆయనది సునాయాస ప్రయాణం కాదు. గుర్తింపు తెచ్చుకోవడానికీ, తను అనుకొన్న లక్ష్యం చేరడానికి ప్రారంభంలో ఆయన చాలా కష్టపడాల్సి వచ్చింది. హీరోగా, విలన్ గా, హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో హీరోగా.... ఇలా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ వద్దనకుండా సద్వినియోగం చేసుకొంటూ తన పేరునీ ఉనికినీ జన హృదయాల్లో రిజిస్టర్ చేయించుకున్నారు చిరంజీవి. పాత్ర ఏదైనా, దానికి ఎంత ప్రాధాన్యం ఉన్నా 'చిరంజీవి అదరగొట్టేశాడ్రా' అనిపించుకున్నారు.
- యు. వినాయకరావు