ప్రతి మనిషి జీవితం ఒక పెద్ద కధలా ఉంటుంది. అలాగే ప్రతివారి జీవితంలోను ఎత్తులు, పల్లాలు ఉంటాయి.ప్రతి జీవితంలోను ఒక చరిత్ర ఉంటుంది. చరిత్ర సృష్టించినవారి జీవితాలు బయట చాలామందికి తెలియకపోవచ్చు. నా జీవితం ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్నో ఎత్తులు... పల్లాలు, ఎన్నో విజయాలు... ఎన్నో అపజయాలు, ఎన్నో కష్టాలు... ఎన్నో నష్టాలు, ఎన్నో సుఖాలు.. ఎన్నో కీర్తి ప్రతిష్టలు, ఎన్నో అవమానాలు చోటుచేసుకున్నాయి. ఎక్కడో ఓ పేద కుటుంబంలో పుట్టి, నా కుటుంబానికి, నా బంధువులకు, నా స్నేహితులకు తప్ప వేరే ప్రపంచానికి తెలియని నన్ను 16కోట్ల తెలుగు ప్రజలకు తెలిసే అవకాశాన్నిచ్చిన సినీ కళామతల్లికి నమస్కరిస్తూ నా జీవిత కధను రాయాలనుకున్నాను. ఈలోగా ప్రముఖ పాత్రికేయుడు వినాయకరావు నా దగ్గరకు వచ్చి మీ బయోగ్రఫీ రాస్తాను అన్నాడు. నేను అయిష్టంగానే సరే అన్నాను. సినిమాల గురించి రాసిన విశ్లేషణ చదివిన తర్వాత అతని కృషికి నిజంగా మనసారా అభినందించకుండా ఉండలేకపోయాను. అలాగే మొత్తం 150 సినిమాల వెనకవున్న కధని, వాటికి కృషిచేసిన సాంకేతిక నిపుణులని, నటీనటులని ప్రస్తావించాడు.
- దాసరి. నారాయణరావు
దాసరి ఏ సినిమా తీసినా, ఏ స్క్రిప్టు రాసినా, ఏ పాట ఆయన కలం నుంచి జాలువారినా ఒక ప్రత్యేకత ఎందుకుంటుందంటే ఆయనకు జివితంపైనా, సమాజంపైనా, మానవ సంబంధాలపైనా పూర్తి అవగాహన ఉన్నది కనుక. సమాజంలో, వ్యవస్థలో ఉన్న కుళ్ళు, మానవ సంబంధాల్లో ఉన్న డొల్లతనం, మనిషిని మనిషి అర్ధం చేసుకోలేని దౌర్భాగ్యం, జీవితాల్లో డబ్బు సృష్టిస్తున్న సంక్షోభం, విచ్చిన్నమైపోతున్న కుటుంబాలు, యాంత్రికమవుతున్న భార్యాభర్తల సంబంధాలు, ప్రేమించే హృదయాలు, నిస్సహాయంగా మనసులు చేసే ఆర్తనాదాలు మొదలైనవన్ని సజీవంగా తన సినిమాలతో మన కళ్ళముందుంచుతారు. అదేవిధంగా ఆయనలో అంతర్గతంగా నిబిడీకృతమైన తిరుగుబాటుతత్వం, ప్రశ్నించే మనస్తత్వం కూడా ఆయన సినిమాల్లో మనకు కనిపిస్తాయి. ఆయన వ్యంగం ఒక శరాఘాతంలా గుండెల్లోకి దూసుకుపోతుంది. ఆయన ప్రశ్న మెదడును కకావికలు చేస్తుంది. ఆయన సృష్టించిన జీవిత చిత్రాలు చిరకాలం మన మనఃఫలకంలో నిలిచిపోతాయి.
ఆయన నటన, దర్శకత్వం ఒక ఎతైతే ఆయన చేసిన రచనలు మరొక ఎత్తు. అవన్నీ ముద్రితమై "దాసరి రచనా సర్వస్వం" గా ఒకచోట చుడాలనేదే నా చిరకాల వాంఛ. అందులో ఒక భాగమే వినాయకరావుగారు రూపొందించిన 'విశ్వవిజేత విజయగాధ'. ఇంత చక్కగా, పొందికగా, వివరణాత్మకంగా ఈ గ్రంధాన్ని సాకారం చేసిన వినాయకరావుగారు అభినందనీయులు.
- వినాయకరావు
ప్రతి మనిషి జీవితం ఒక పెద్ద కధలా ఉంటుంది. అలాగే ప్రతివారి జీవితంలోను ఎత్తులు, పల్లాలు ఉంటాయి.ప్రతి జీవితంలోను ఒక చరిత్ర ఉంటుంది. చరిత్ర సృష్టించినవారి జీవితాలు బయట చాలామందికి తెలియకపోవచ్చు. నా జీవితం ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్నో ఎత్తులు... పల్లాలు, ఎన్నో విజయాలు... ఎన్నో అపజయాలు, ఎన్నో కష్టాలు... ఎన్నో నష్టాలు, ఎన్నో సుఖాలు.. ఎన్నో కీర్తి ప్రతిష్టలు, ఎన్నో అవమానాలు చోటుచేసుకున్నాయి. ఎక్కడో ఓ పేద కుటుంబంలో పుట్టి, నా కుటుంబానికి, నా బంధువులకు, నా స్నేహితులకు తప్ప వేరే ప్రపంచానికి తెలియని నన్ను 16కోట్ల తెలుగు ప్రజలకు తెలిసే అవకాశాన్నిచ్చిన సినీ కళామతల్లికి నమస్కరిస్తూ నా జీవిత కధను రాయాలనుకున్నాను. ఈలోగా ప్రముఖ పాత్రికేయుడు వినాయకరావు నా దగ్గరకు వచ్చి మీ బయోగ్రఫీ రాస్తాను అన్నాడు. నేను అయిష్టంగానే సరే అన్నాను. సినిమాల గురించి రాసిన విశ్లేషణ చదివిన తర్వాత అతని కృషికి నిజంగా మనసారా అభినందించకుండా ఉండలేకపోయాను. అలాగే మొత్తం 150 సినిమాల వెనకవున్న కధని, వాటికి కృషిచేసిన సాంకేతిక నిపుణులని, నటీనటులని ప్రస్తావించాడు. - దాసరి. నారాయణరావు దాసరి ఏ సినిమా తీసినా, ఏ స్క్రిప్టు రాసినా, ఏ పాట ఆయన కలం నుంచి జాలువారినా ఒక ప్రత్యేకత ఎందుకుంటుందంటే ఆయనకు జివితంపైనా, సమాజంపైనా, మానవ సంబంధాలపైనా పూర్తి అవగాహన ఉన్నది కనుక. సమాజంలో, వ్యవస్థలో ఉన్న కుళ్ళు, మానవ సంబంధాల్లో ఉన్న డొల్లతనం, మనిషిని మనిషి అర్ధం చేసుకోలేని దౌర్భాగ్యం, జీవితాల్లో డబ్బు సృష్టిస్తున్న సంక్షోభం, విచ్చిన్నమైపోతున్న కుటుంబాలు, యాంత్రికమవుతున్న భార్యాభర్తల సంబంధాలు, ప్రేమించే హృదయాలు, నిస్సహాయంగా మనసులు చేసే ఆర్తనాదాలు మొదలైనవన్ని సజీవంగా తన సినిమాలతో మన కళ్ళముందుంచుతారు. అదేవిధంగా ఆయనలో అంతర్గతంగా నిబిడీకృతమైన తిరుగుబాటుతత్వం, ప్రశ్నించే మనస్తత్వం కూడా ఆయన సినిమాల్లో మనకు కనిపిస్తాయి. ఆయన వ్యంగం ఒక శరాఘాతంలా గుండెల్లోకి దూసుకుపోతుంది. ఆయన ప్రశ్న మెదడును కకావికలు చేస్తుంది. ఆయన సృష్టించిన జీవిత చిత్రాలు చిరకాలం మన మనఃఫలకంలో నిలిచిపోతాయి. ఆయన నటన, దర్శకత్వం ఒక ఎతైతే ఆయన చేసిన రచనలు మరొక ఎత్తు. అవన్నీ ముద్రితమై "దాసరి రచనా సర్వస్వం" గా ఒకచోట చుడాలనేదే నా చిరకాల వాంఛ. అందులో ఒక భాగమే వినాయకరావుగారు రూపొందించిన 'విశ్వవిజేత విజయగాధ'. ఇంత చక్కగా, పొందికగా, వివరణాత్మకంగా ఈ గ్రంధాన్ని సాకారం చేసిన వినాయకరావుగారు అభినందనీయులు. - వినాయకరావు© 2017,www.logili.com All Rights Reserved.