ప్రపంచ ఇతిహాసాలన్నిటిలోనూ కొన్ని సమాన లక్షణాలుంటాయన్న స్ఫురణతో ఆసియాఖండంలో అతిముఖ్యమైన పారశీకుల షహనామా భారతీయుల మహాభారతాన్ని తులనాత్మకంగా పరిశీలిస్తూ భారతీయుల దార్శనికస్థితిని ఈ రచన వెలుగులోకి తెచ్చింది. పర్షియన్ భాష మాట్లాడేవారికి షహనామా జాతియేతిహాసం. భారతీయులకు మహాభారతం మహేతిహాసం. పారశీక సంస్కృతికి షహనామా ప్రతిబింబమైతే భారతీయ తత్త్వాన్ని ప్రపంచానికి చాటింది మహాభారతం. షహనామా అంటే రాజుల వంశచరిత్ర. మహాభారతం చంద్రవంశరాజుల చరిత్ర. రెండూ అపురూపమైన రత్నాల గనులు.
విశ్వసాహిత్యం భిన్నత్వంలో ఏకత్వం కలది అన్న మాటలు వింటూ ఉంటాం. ఆ ఏకత్వం.. ఏ రీతిలో ఉంటుందని చెప్పేవాళ్ళున్నా ఈ రీతిగా ఉంటుంది తులనాత్మక పరిశీలన చేసి చెప్పే వాళ్ళు తక్కువగా ఉంటారు. ఆ పనిని షహనామా - మహాభారతాలను తులనాత్మకంగా అధ్యయనం చేస్తూ తరతమ్యవిశ్లేషణ చేసిన వ్యక్తి యు. ఎ. నరసింహమూర్తి. వారు చేసిన అధ్యయనాను శీలన కాలగర్భంలో కలవడకూడదన్న దృష్టితో వస్తున్న రచన ఇది.
డా. యు. ఎ. నరసింహమూర్తి