గత ఆరు సంవత్సరాలుగా ఎబిఎన్ ఆంద్రజ్యోతి న్యూస్ ఛానల్ పక్షాన శ్రీ వేమూరి రాధాకృష్ణ వివిధ రంగాల ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. దాని శీర్షిక 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'. ఈ కార్యక్రమంతో శ్రీ రాధాకృష్ణ ఆర్కేగా ప్రేక్షక బాహుళ్యంలో ఆదరణ పొందారు. అదే పేరుతో ప్రసిద్ధులయ్యారు. ఈ కార్యక్రమాన్ని వారం వారం క్రమం తప్పక చూసేవాళ్ళలో నేనూ ఒకడిని. సూటిగా ప్రశ్నించటం, చాలా సాధారణమైన వ్యావహారిక ధోరణిలో ఈ కార్యక్రమం నడపటం, ఎంత క్లిష్టమైన ప్రశ్న అయినా ఎదుటివారికి ఇబ్బందికరమైనదైనా మొహమాటం లేకుండా ఆర్కే అడిగే తీరు, నడిచే తీరులో వుండే సెన్సాఫ్ హ్యూమర్... ఇవన్నీ ఈ కార్యక్రమాన్ని ప్రసిద్ధం చేసాయి. వివిధ రంగాలలో ప్రసిద్ధులతో ధారావాహికంగా జరిగిన కార్యక్రమం మన తెలుగు టీవీలలో మరొకటి ఉండదేమో!
- ఎమెస్కో విజయకుమార్
ఈ కార్యక్రమం ద్వారా తక్షణ ప్రాసంగికత ఉండే అంశాలపై వారితో చర్చించడం, వారి మనోలోకాలలో ప్రవేశించడం ద్వారా వారి తత్త్వాన్ని అవగాహన చేసుకునే అవకాశం ఏర్పడటం ప్రేక్షకులకు కలిగిన లాభం. ఈ మొత్తం కార్యక్రమానికి శ్రమించే ప్రొడ్యూసర్ రమేష్ తో పాటు ఇతర సాంకేతిక నిపుణులకు నా కృతఙ్ఞతలు. ఇపుడు ఈ ముఖాముఖీలను పుస్తక రూపంలో తీసుకురావడానికి సాహసించారు. ఇందుకు వారికీ, ఈ పుస్తక రూపకల్పనలో సమన్వయకర్తగా వ్యవహరించిన సీవీఎల్ ఎన్ ప్రసాద్ కు కృతఙ్ఞతలు.
- వేమూరి రాధాకృష్ణ
గత ఆరు సంవత్సరాలుగా ఎబిఎన్ ఆంద్రజ్యోతి న్యూస్ ఛానల్ పక్షాన శ్రీ వేమూరి రాధాకృష్ణ వివిధ రంగాల ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. దాని శీర్షిక 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'. ఈ కార్యక్రమంతో శ్రీ రాధాకృష్ణ ఆర్కేగా ప్రేక్షక బాహుళ్యంలో ఆదరణ పొందారు. అదే పేరుతో ప్రసిద్ధులయ్యారు. ఈ కార్యక్రమాన్ని వారం వారం క్రమం తప్పక చూసేవాళ్ళలో నేనూ ఒకడిని. సూటిగా ప్రశ్నించటం, చాలా సాధారణమైన వ్యావహారిక ధోరణిలో ఈ కార్యక్రమం నడపటం, ఎంత క్లిష్టమైన ప్రశ్న అయినా ఎదుటివారికి ఇబ్బందికరమైనదైనా మొహమాటం లేకుండా ఆర్కే అడిగే తీరు, నడిచే తీరులో వుండే సెన్సాఫ్ హ్యూమర్... ఇవన్నీ ఈ కార్యక్రమాన్ని ప్రసిద్ధం చేసాయి. వివిధ రంగాలలో ప్రసిద్ధులతో ధారావాహికంగా జరిగిన కార్యక్రమం మన తెలుగు టీవీలలో మరొకటి ఉండదేమో! - ఎమెస్కో విజయకుమార్ ఈ కార్యక్రమం ద్వారా తక్షణ ప్రాసంగికత ఉండే అంశాలపై వారితో చర్చించడం, వారి మనోలోకాలలో ప్రవేశించడం ద్వారా వారి తత్త్వాన్ని అవగాహన చేసుకునే అవకాశం ఏర్పడటం ప్రేక్షకులకు కలిగిన లాభం. ఈ మొత్తం కార్యక్రమానికి శ్రమించే ప్రొడ్యూసర్ రమేష్ తో పాటు ఇతర సాంకేతిక నిపుణులకు నా కృతఙ్ఞతలు. ఇపుడు ఈ ముఖాముఖీలను పుస్తక రూపంలో తీసుకురావడానికి సాహసించారు. ఇందుకు వారికీ, ఈ పుస్తక రూపకల్పనలో సమన్వయకర్తగా వ్యవహరించిన సీవీఎల్ ఎన్ ప్రసాద్ కు కృతఙ్ఞతలు. - వేమూరి రాధాకృష్ణ© 2017,www.logili.com All Rights Reserved.