అకారణం
అ
నిర్నిమిత్తంబ నిందింప నీకుఁదగునె?
- కంకంటి, ఉత్తర రామాయణము
చెట్టుకి ఆకు తొడగటానికీ, పువ్వులు పుయ్యడానికి ఏ కారణమూ కనబడదు.
చలం, మ్యూజింగ్స్
అక్షరం
అక్షరంబు తల్లి యఖిలవిద్యల కెన్న
నక్షరంబు లోకరక్షకంబు అక్షరంబులేని యబలున కెందును భిక్ష పుట్టఁబోదు పృధ్విలోన,
అక్షరంబు తన్ను రక్షించుగావున నక్షరంబు లోక రక్షితంబు!
చాటువు
- వేటూరి, చాటుపద్య మణిమంజరి
దేవకాంతే అయినప్పుడు ఆవిడకి అక్షరజ్ఞానం ఉంటేనేఁవిఁటి, లేకపోతే నేఁవింటి. ఆ మాట కొస్తే మానవకాంతలైన సీతాసావిత్రులు ఏమ్మేలూబియ్యేలూ పాసెయారంటారా?
- రావిశాస్త్రి, రత్తాలు - రాంబాబు
జిహ్వ నాల్గచ్చరాలు నేర్చిన కతానఁ బడుపుఁ గూటికి మనసు గొల్పక నిటైతి. తమ్మయ్య, వైజయంతీ విలాసము
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు.
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు.
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే
అందమైన ఆడపిల్లలు.
తిలక్, నా కవిత్వం
నా వ్రాలు సుధారసాలు, కవిరాజుల కెల్ల మనో
హరాలు వజ్రాలు
సరస్వతీ విమలచారుకుచాగ్ర సరాలు.
అగడు
- చాటువు
అగడు మగడి పాలు, ఆనందం (అనుభవం)
ఊరిపాలు..................
అకారణం అ నిర్నిమిత్తంబ నిందింప నీకుఁదగునె? - కంకంటి, ఉత్తర రామాయణము చెట్టుకి ఆకు తొడగటానికీ, పువ్వులు పుయ్యడానికి ఏ కారణమూ కనబడదు. చలం, మ్యూజింగ్స్ అక్షరం అక్షరంబు తల్లి యఖిలవిద్యల కెన్న నక్షరంబు లోకరక్షకంబు అక్షరంబులేని యబలున కెందును భిక్ష పుట్టఁబోదు పృధ్విలోన, అక్షరంబు తన్ను రక్షించుగావున నక్షరంబు లోక రక్షితంబు! చాటువు - వేటూరి, చాటుపద్య మణిమంజరి దేవకాంతే అయినప్పుడు ఆవిడకి అక్షరజ్ఞానం ఉంటేనేఁవిఁటి, లేకపోతే నేఁవింటి. ఆ మాట కొస్తే మానవకాంతలైన సీతాసావిత్రులు ఏమ్మేలూబియ్యేలూ పాసెయారంటారా? - రావిశాస్త్రి, రత్తాలు - రాంబాబు జిహ్వ నాల్గచ్చరాలు నేర్చిన కతానఁ బడుపుఁ గూటికి మనసు గొల్పక నిటైతి. తమ్మయ్య, వైజయంతీ విలాసము నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు. నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు. నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. తిలక్, నా కవిత్వం నా వ్రాలు సుధారసాలు, కవిరాజుల కెల్ల మనో హరాలు వజ్రాలు సరస్వతీ విమలచారుకుచాగ్ర సరాలు. అగడు - చాటువు అగడు మగడి పాలు, ఆనందం (అనుభవం) ఊరిపాలు..................© 2017,www.logili.com All Rights Reserved.