ప్రస్తుత కాలంలో విజ్ఞానశాస్త్రంలో సాంకేతిక విప్లవాత్మక, అద్భుతమైన మార్పులు నిత్యం జరుగుతున్నాయి. సగటు మనిషి ఆర్ధికపరిస్థితులు మెరుగుపడుతున్నా జీవితంలో ఏదో కొరత, వెలితి స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆనందం, సంతోషం కరువు అవుతున్నాయి. మనిషి జీవితంలో తృప్తి లేకపోవడంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండలేకపోతున్నాడు. ప్రస్తుతం అనారోగ్యానికి కారణమైన అనేక రోగాలకు చాలావరకు దైనందినజీవితంలో నవీననాగరికత పేరుతో వచ్చిన మార్పులే కారణం అని శాస్త్రీయ పరిశోధనఫలితాలు తెలుపుతున్నాయి.
ముఖ్యంగా గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం, అధికరక్తపోటు, పక్షవాతం, కీళ్ళవాతం, లైంగికసమస్యలు, మానసికరోగాలు, మొదలైనవి చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటికి ముఖ్యకారణం మానసిక ఒత్తిడి, మానసిక ప్రశాంతత లేకపోవడం. మన ఆరోగ్యం మనచేతిలో ఉంటుంది అని తెలిసినా మన సోమరితనం, అజాగ్రత్తల వలన మన అనారోగ్యానికి మనమే కారణం అవుతున్నాము. "ఆరోగ్యమే మహాభాగ్యం" అనే నానుడికి అనుగుణంగా శ్రీ వెంకటరెడ్డిగారు "ఆరోగ్యప్రదాత - మన మానసిక ప్రశాంతత" అనే పుస్తకం వ్రాయడం ముదావహం.
ప్రస్తుత కాలంలో విజ్ఞానశాస్త్రంలో సాంకేతిక విప్లవాత్మక, అద్భుతమైన మార్పులు నిత్యం జరుగుతున్నాయి. సగటు మనిషి ఆర్ధికపరిస్థితులు మెరుగుపడుతున్నా జీవితంలో ఏదో కొరత, వెలితి స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆనందం, సంతోషం కరువు అవుతున్నాయి. మనిషి జీవితంలో తృప్తి లేకపోవడంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండలేకపోతున్నాడు. ప్రస్తుతం అనారోగ్యానికి కారణమైన అనేక రోగాలకు చాలావరకు దైనందినజీవితంలో నవీననాగరికత పేరుతో వచ్చిన మార్పులే కారణం అని శాస్త్రీయ పరిశోధనఫలితాలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం, అధికరక్తపోటు, పక్షవాతం, కీళ్ళవాతం, లైంగికసమస్యలు, మానసికరోగాలు, మొదలైనవి చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటికి ముఖ్యకారణం మానసిక ఒత్తిడి, మానసిక ప్రశాంతత లేకపోవడం. మన ఆరోగ్యం మనచేతిలో ఉంటుంది అని తెలిసినా మన సోమరితనం, అజాగ్రత్తల వలన మన అనారోగ్యానికి మనమే కారణం అవుతున్నాము. "ఆరోగ్యమే మహాభాగ్యం" అనే నానుడికి అనుగుణంగా శ్రీ వెంకటరెడ్డిగారు "ఆరోగ్యప్రదాత - మన మానసిక ప్రశాంతత" అనే పుస్తకం వ్రాయడం ముదావహం.© 2017,www.logili.com All Rights Reserved.