తెలుగు చిత్రకళ అనగానే దామర్ల రామారావు గారి పేరు తొలుతగా స్ఫురణకు వస్తుంది. ఆధునికాంధ్ర చిత్రకళకు పితామహుడాయన. ఆయన శిష్యప్రశిష్యులైన యువచిత్రకారులు ఆయనలా చిత్రించాలని ఉవ్విళ్లూరే వారంటారు. అదొక కళా చైతన్యం.
ఆధునిక తెలుగు సాహిత్యం, ఆధునిక తెలుగు చిత్రకళ ఇంచుమించు ఒకే సమయంలో మొదలయ్యాయి. రెండింటి పైన అధివాస్తవిక ధోరణుల ప్రభావం సమానంగానే ప్రతిఫలించింది. ఆధునికాంధ్ర కవిత్వంలో మాదిరే చిత్రకళలోనూ ఎన్నో పోకడలు కనిపించాయి. దామెర్ల వారు పూయించిన కొత్తపూలు తెలుగునాట చిత్రకళను ఒక అధ్యయనాంశంగా అభ్యాసం చేయాలనే ఆలోచనలకు దారితీశాయి. రాజమహేంద్రవరంలో దామెర్ల రామారావు లలితకళాశాల ఏర్పడింది.
- సుంకర చలపతిరావు