తుంటరి లోయలు
ఆకాశాన్ని అందుకున్నట్టుగా కనిపించే పర్వత శిఖరాలెంత గంభీరమైనవో, వాటినానుకుని కిందికి సాగే లోయలంత తుంటరివి..
యేరెండు శిఖరాలూ వొకలా సాధించవు. యేరెండు లోయలూ వొకలా వేదించవు. జాగ్రత్తగా గమనిస్తే యే యిద్దరు మనుషులు వొకలా వుండరని తెలుసుకో గలుగుతాం.
యెవరి ఆంతర్యం వాళ్ళదే అయిన యీ లోకంలో, ప్రతి మనిషీ వొంటరి శిఖరంలాగే బతక్క తప్పదు. అనివార్యంగా శిఖరాల నంటిపెట్టుకునే లోయలా జారిపోకా తప్పదు.
శిఖరాలు, లోయల బలాలు, బలహీనతలు కలగలసిన మానవ అస్తిత్వ ప్రవృత్తులు యెప్పటికప్పుడు కలిగించే విభ్రమాల్నీ, విస్మయాల్నీ చిత్రించే కథల సంపుటం యిది.
1977లో 'గుర్రమూ కళ్ళెమూ' అనే కథ రాసినప్పుడు నేనిలాంటి కథలు మరికొన్ని రాస్తాననీ, వాటినిలా వొక సంపుటంగా తీసుకురాగలననీ అనుకోలేదు. మొదటి నుంచీ సాహిత్యం నాకు ప్రపంచాన్ని అవగాహన చేసుకునే వేదికగానూ, సత్యాన్వేషణకొక వాహికగానూ, వ్యక్తిగత శోధనకొక మాధ్యమంగానూ కూడా తోడ్పడుతూ వస్తోంది.
వీటికి తాత్విక కథలనే పెద్ద పేరు పెట్టలేను గానీ యివన్నీ జీవితాన్ని మనస్సునూ ప్రశ్నించే కథలని మాత్రం చెప్పగలను - భౌతిక పార భౌతిక ప్రపంచాల మధ్య ఊగిసలాడే మానవుడి వెంపర్లాటలను అర్థం చేసుకోడానికి ప్రయత్నించే కథలివి. ప్రతిక్షణమూ | పరిణామాలకు గురవుతూ, అనుక్షణమూ సంక్లిష్టంగా మారిపోయే ప్రపంచంలో..............
తుంటరి లోయలు ఆకాశాన్ని అందుకున్నట్టుగా కనిపించే పర్వత శిఖరాలెంత గంభీరమైనవో, వాటినానుకుని కిందికి సాగే లోయలంత తుంటరివి.. యేరెండు శిఖరాలూ వొకలా సాధించవు. యేరెండు లోయలూ వొకలా వేదించవు. జాగ్రత్తగా గమనిస్తే యే యిద్దరు మనుషులు వొకలా వుండరని తెలుసుకో గలుగుతాం. యెవరి ఆంతర్యం వాళ్ళదే అయిన యీ లోకంలో, ప్రతి మనిషీ వొంటరి శిఖరంలాగే బతక్క తప్పదు. అనివార్యంగా శిఖరాల నంటిపెట్టుకునే లోయలా జారిపోకా తప్పదు. శిఖరాలు, లోయల బలాలు, బలహీనతలు కలగలసిన మానవ అస్తిత్వ ప్రవృత్తులు యెప్పటికప్పుడు కలిగించే విభ్రమాల్నీ, విస్మయాల్నీ చిత్రించే కథల సంపుటం యిది. 1977లో 'గుర్రమూ కళ్ళెమూ' అనే కథ రాసినప్పుడు నేనిలాంటి కథలు మరికొన్ని రాస్తాననీ, వాటినిలా వొక సంపుటంగా తీసుకురాగలననీ అనుకోలేదు. మొదటి నుంచీ సాహిత్యం నాకు ప్రపంచాన్ని అవగాహన చేసుకునే వేదికగానూ, సత్యాన్వేషణకొక వాహికగానూ, వ్యక్తిగత శోధనకొక మాధ్యమంగానూ కూడా తోడ్పడుతూ వస్తోంది. వీటికి తాత్విక కథలనే పెద్ద పేరు పెట్టలేను గానీ యివన్నీ జీవితాన్ని మనస్సునూ ప్రశ్నించే కథలని మాత్రం చెప్పగలను - భౌతిక పార భౌతిక ప్రపంచాల మధ్య ఊగిసలాడే మానవుడి వెంపర్లాటలను అర్థం చేసుకోడానికి ప్రయత్నించే కథలివి. ప్రతిక్షణమూ | పరిణామాలకు గురవుతూ, అనుక్షణమూ సంక్లిష్టంగా మారిపోయే ప్రపంచంలో..............© 2017,www.logili.com All Rights Reserved.