భారతీయ సమాజంలో హిందూ మహా వృక్షానికి 'కులము' అనే విష పురుగు ఎప్పుడూ తొలుస్తూనే ఉన్నది. ప్రతీ కులస్తుడూ తనకూ, మిగిలిన కులాలకు మధ్య అడ్డుగోడ కట్టుకుంటూ సంకుచిత మనస్కుడౌతున్నాడు. ఇది నాటి నుండీ నేటికీ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. కుల సమీకరణలూ, కులపోరాటాలూ నిస్సిగ్గుగా జరుగుతూనే ఉన్నాయి. కులాన్ని అడ్డుపెట్టుకొని ఎదిగిన పిమ్మట కనీసం తన కులంలోని పేదలకు కూడా ఎవరూ ఏమీ చేయడంలేదు. చదువుకుంటున్న విద్యాధికులు కూడా ఈ విష చట్రంలో ఇరుక్కొని పోతూండడం నేటి భారతంలో ఒక విషపరిణామం. ఈ విషఛట్రం నుండి బయటపడి సమాజాన్ని కుల రహిత వ్యవస్థగా మార్చాలంటే అంబేద్కర్ ను విస్తృతంగా అధ్యయనం చెయ్యాలి. ఆ మహనీయుని ఆణిముత్యాలను గ్రహించి కులరహిత వ్యవస్థ ఏర్పాటుకు మనమందరమూ పయనిద్దాం....
- జనార్ధన స్వామి
భారతీయ సమాజంలో హిందూ మహా వృక్షానికి 'కులము' అనే విష పురుగు ఎప్పుడూ తొలుస్తూనే ఉన్నది. ప్రతీ కులస్తుడూ తనకూ, మిగిలిన కులాలకు మధ్య అడ్డుగోడ కట్టుకుంటూ సంకుచిత మనస్కుడౌతున్నాడు. ఇది నాటి నుండీ నేటికీ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. కుల సమీకరణలూ, కులపోరాటాలూ నిస్సిగ్గుగా జరుగుతూనే ఉన్నాయి. కులాన్ని అడ్డుపెట్టుకొని ఎదిగిన పిమ్మట కనీసం తన కులంలోని పేదలకు కూడా ఎవరూ ఏమీ చేయడంలేదు. చదువుకుంటున్న విద్యాధికులు కూడా ఈ విష చట్రంలో ఇరుక్కొని పోతూండడం నేటి భారతంలో ఒక విషపరిణామం. ఈ విషఛట్రం నుండి బయటపడి సమాజాన్ని కుల రహిత వ్యవస్థగా మార్చాలంటే అంబేద్కర్ ను విస్తృతంగా అధ్యయనం చెయ్యాలి. ఆ మహనీయుని ఆణిముత్యాలను గ్రహించి కులరహిత వ్యవస్థ ఏర్పాటుకు మనమందరమూ పయనిద్దాం.... - జనార్ధన స్వామి© 2017,www.logili.com All Rights Reserved.