గాలి, నీరు, ఆహారం అన్నీ కలుషితం అయినప్పుడు మన భావాలు కూడా కలుషితం కాకతప్పదు. జీవితం దుర్బరమైనప్పుడు భౌతిక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఈ సందర్భంలో 'ఆరోగ్యం' అనే మాటకి అర్ధం మారిపోతుంది. పర్యావరణం పచ్చగా ఉన్నప్పుడే అన్నిరకాల ఆరోగ్యాలు మనిషికి చేకూరుతాయి. నగరాలలో జీవిస్తున్న మనిషి సూర్యోదయాన్ని, చంద్రోదయాన్నిచుదలేకపోతున్నాడు.అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చిన తరువాత పిల్లలు మొక్కల పెంపకానికి దూరమయ్యారు.
ఏ గింజ ఏ చెట్టుకు పుడుతుందో కండ్లతో చూడలేని పరిస్థితి ఏర్పడింది. ప్రకృతి నదుమా అనేక ఆటలు ఆడుకున్న పాత తరం వారికీ కేవలం టీవీ తెరమీద ఆటలను చూస్తున్న ఈ తరం వారికీ మధ్య ఉన్నఅంతరం మాటల్లో చెప్పలేము. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు నడుంకట్టిన వ్యక్తులకు, సంస్థలకు ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లు అంతా ఇంతా కాదు.
-డా.గంటా జలంధర్ రెడ్డి
గాలి, నీరు, ఆహారం అన్నీ కలుషితం అయినప్పుడు మన భావాలు కూడా కలుషితం కాకతప్పదు. జీవితం దుర్బరమైనప్పుడు భౌతిక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఈ సందర్భంలో 'ఆరోగ్యం' అనే మాటకి అర్ధం మారిపోతుంది. పర్యావరణం పచ్చగా ఉన్నప్పుడే అన్నిరకాల ఆరోగ్యాలు మనిషికి చేకూరుతాయి. నగరాలలో జీవిస్తున్న మనిషి సూర్యోదయాన్ని, చంద్రోదయాన్నిచుదలేకపోతున్నాడు.అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చిన తరువాత పిల్లలు మొక్కల పెంపకానికి దూరమయ్యారు. ఏ గింజ ఏ చెట్టుకు పుడుతుందో కండ్లతో చూడలేని పరిస్థితి ఏర్పడింది. ప్రకృతి నదుమా అనేక ఆటలు ఆడుకున్న పాత తరం వారికీ కేవలం టీవీ తెరమీద ఆటలను చూస్తున్న ఈ తరం వారికీ మధ్య ఉన్నఅంతరం మాటల్లో చెప్పలేము. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు నడుంకట్టిన వ్యక్తులకు, సంస్థలకు ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లు అంతా ఇంతా కాదు. -డా.గంటా జలంధర్ రెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.