ఇవి వజ్రపుష్పాలు. విస్తృతమైన జీవితానుభవ వృక్షానికి పూసిన కవితాపుష్పాలు. పరిణితి చెందిన ఒక మేధావి హృదయంలోంచి ఉప్పొంగిన భావధారాలు. కవి చుట్టూ కుటుంబం ఉంటుంది. సమాజం ఉంటుంది. మంచీ చెడూ రెండూ ఉంటాయి. చీకటీ వెలుతురూ ఉంటాయి. ఆత్మీయతలుంటాయి, అనుబందాలుంటాయి. జ్ఞాపకాలుంటాయి. పశ్చాత్తాపాలుంటాయి. అలాగే ఈ కవితాసంపుటిలో మిత్రులు నరసింహారెడ్డిగారి విభిన్న అనుభూతులు, ఊహలు, ఉద్వేగాలు, కల్పనలు, ఆదర్శాలు, లక్ష్యాలు నిక్షేపమై ఉన్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో మారిపోతున్న మానవ సంబంధాలు, లుప్తమౌతున్న మానవ విలువలు, అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసం చిత్రింపబడింది.
సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల భక్తీ, కుటుంబం పట్ల గౌరవం, భవిష్యత్తు పై విశ్వాసం గల ఒక సృజనకారుడి కలంగీసిన అక్షరచిత్రాలివి. ఇవి వస్తు ప్రాధాన్యత గల కవితలు. వీటిలో శైలి, శిల్పం, నగిషీలు వెదకకండి. సమాజాన్ని, వ్యక్తిని, విలువలను, సందేశాన్ని అన్వేషిద్దాం, ఆస్వాదిద్దాం. ఒక ఉదాత్త సమాజ నిర్మాణం కోసం పరితపిస్తున్న బాధ్యతగల మనిషి గుండెచప్పుళ్ళు విందాం. స్ఫూర్తిని పొందుదాం. ఈ సంపుటి నవచేతన కుసుమంగా వికసించడం మరింత హర్షణీయం. ఆనందాయకం.
- డా ఎస్వీ సత్యనారాయణ
ఇవి వజ్రపుష్పాలు. విస్తృతమైన జీవితానుభవ వృక్షానికి పూసిన కవితాపుష్పాలు. పరిణితి చెందిన ఒక మేధావి హృదయంలోంచి ఉప్పొంగిన భావధారాలు. కవి చుట్టూ కుటుంబం ఉంటుంది. సమాజం ఉంటుంది. మంచీ చెడూ రెండూ ఉంటాయి. చీకటీ వెలుతురూ ఉంటాయి. ఆత్మీయతలుంటాయి, అనుబందాలుంటాయి. జ్ఞాపకాలుంటాయి. పశ్చాత్తాపాలుంటాయి. అలాగే ఈ కవితాసంపుటిలో మిత్రులు నరసింహారెడ్డిగారి విభిన్న అనుభూతులు, ఊహలు, ఉద్వేగాలు, కల్పనలు, ఆదర్శాలు, లక్ష్యాలు నిక్షేపమై ఉన్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో మారిపోతున్న మానవ సంబంధాలు, లుప్తమౌతున్న మానవ విలువలు, అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసం చిత్రింపబడింది. సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల భక్తీ, కుటుంబం పట్ల గౌరవం, భవిష్యత్తు పై విశ్వాసం గల ఒక సృజనకారుడి కలంగీసిన అక్షరచిత్రాలివి. ఇవి వస్తు ప్రాధాన్యత గల కవితలు. వీటిలో శైలి, శిల్పం, నగిషీలు వెదకకండి. సమాజాన్ని, వ్యక్తిని, విలువలను, సందేశాన్ని అన్వేషిద్దాం, ఆస్వాదిద్దాం. ఒక ఉదాత్త సమాజ నిర్మాణం కోసం పరితపిస్తున్న బాధ్యతగల మనిషి గుండెచప్పుళ్ళు విందాం. స్ఫూర్తిని పొందుదాం. ఈ సంపుటి నవచేతన కుసుమంగా వికసించడం మరింత హర్షణీయం. ఆనందాయకం. - డా ఎస్వీ సత్యనారాయణ© 2017,www.logili.com All Rights Reserved.