నా జీవితంలోని అనుభవాల్ని, ప్రోదిచేసిన విషయాల్ని 'జీవనాడి'గా రాశాను. జీవిత ప్రయాణంలోని సమస్యలకు వివరణ, పరిజ్ఞానం ఈ పుస్తకంలో దొరుకుతాయి. శీర్షికలన్నీ ఉత్సుకత కల్గించేవిగా, జీవితానికి ఉపయోగపడేవిగా వుంటాయి. జీవితం నియమ నిబంధనలతో మనటానికి, మానసికశుద్ధి, ఆలోచనాసరళి, మంచినడవడిక, నియమ నిబద్ధతలతో, నేను, నాది అనే అహాన్ని తగ్గించుకుని, సాత్వికచింతనతో మానవత్వాన్ని పెంపొందించుకోవాలని తెలియపరుస్తుంది. మానవత్వంలోనే జీవిత మనుగడ వుందని, అహం, క్రోధంతో మృగత్వం పెరిగితే, జీవితంలో మృగత్వం మినహా ఏమీ మిగలదని, ఇది జీవిత మనుగడకు సరియైన దారి కాదని అర్థం అవుతుంది.
ఈ రచనలోని శీర్షికల ద్వారా మనోధైర్యాన్ని, ఆశావాదాన్ని, మనో నిశ్చలతను ప్రోది చేసుకోవచ్చును. జ్ఞానం, ఆత్మజ్ఞానం, మానసిక ఔన్నత్యం అంటే ఏమిటో తెలియవస్తుంది. మనసుకు ఏకాగ్రత, నీతి, నియమాలను పెంపొందిస్తే విజయం తథ్యమని నిరూపిస్తుంది. ఆలోచనా వికాసంతో కోపాన్ని, ఈర్ష్యాద్వేషాలను జయించవచ్చునని, అతిగా మాట్లాడటం, ప్రవర్తించడం లేక సోమరితనాన్ని కలిగి వుండుట జీవన విధానం కాదని తెలియజేస్తుంది.
హుందాతనం జీవితానికి పెట్టనికోట లాంటిదని, దాని ద్వారా జీవితానికి ఎటువంటి ఔన్నత్యం లభిస్తుందో, జీవితానందం, విజయం ఎలా చేకూరతాయో విశదపరుస్తుంది. మానసిక వికాసం, ప్రజ్ఞలతో తేజస్సు నలుదిశలా వ్యాపిస్తుందని, మనిషిని ఉన్నతుడిని చేస్తుందని తెలుపుతుందీ రచన.
వృద్ధాప్యంలో మరణభయంతో కుంగిపోకుండా నిశ్చల మనస్సుతో, నమ్మకంతో బతికే సాధన నేర్పుతుంది. ధ్యాన సాధనతో స్థితప్రజ్ఞత సాధించాలని, సంతోషంగా జీవించాలని నేర్పుతుంది. శరీరంలోని 72 నాడులు ఎలా ఉపయోగపడతాయో అలా జీవితానికి 'జీవనాడి' ఉపయోగపడుతుంది.
ఈ పుస్తకాన్ని సావధానతతో చదివి, అవగాహనతో ఆకళింపు జేసుకుని జీవితాలకు అన్వయించుకుని ఈ రచనను సార్థక పరుస్తారని ఆశిస్తాను.
నా జీవితంలోని అనుభవాల్ని, ప్రోదిచేసిన విషయాల్ని 'జీవనాడి'గా రాశాను. జీవిత ప్రయాణంలోని సమస్యలకు వివరణ, పరిజ్ఞానం ఈ పుస్తకంలో దొరుకుతాయి. శీర్షికలన్నీ ఉత్సుకత కల్గించేవిగా, జీవితానికి ఉపయోగపడేవిగా వుంటాయి. జీవితం నియమ నిబంధనలతో మనటానికి, మానసికశుద్ధి, ఆలోచనాసరళి, మంచినడవడిక, నియమ నిబద్ధతలతో, నేను, నాది అనే అహాన్ని తగ్గించుకుని, సాత్వికచింతనతో మానవత్వాన్ని పెంపొందించుకోవాలని తెలియపరుస్తుంది. మానవత్వంలోనే జీవిత మనుగడ వుందని, అహం, క్రోధంతో మృగత్వం పెరిగితే, జీవితంలో మృగత్వం మినహా ఏమీ మిగలదని, ఇది జీవిత మనుగడకు సరియైన దారి కాదని అర్థం అవుతుంది. ఈ రచనలోని శీర్షికల ద్వారా మనోధైర్యాన్ని, ఆశావాదాన్ని, మనో నిశ్చలతను ప్రోది చేసుకోవచ్చును. జ్ఞానం, ఆత్మజ్ఞానం, మానసిక ఔన్నత్యం అంటే ఏమిటో తెలియవస్తుంది. మనసుకు ఏకాగ్రత, నీతి, నియమాలను పెంపొందిస్తే విజయం తథ్యమని నిరూపిస్తుంది. ఆలోచనా వికాసంతో కోపాన్ని, ఈర్ష్యాద్వేషాలను జయించవచ్చునని, అతిగా మాట్లాడటం, ప్రవర్తించడం లేక సోమరితనాన్ని కలిగి వుండుట జీవన విధానం కాదని తెలియజేస్తుంది. హుందాతనం జీవితానికి పెట్టనికోట లాంటిదని, దాని ద్వారా జీవితానికి ఎటువంటి ఔన్నత్యం లభిస్తుందో, జీవితానందం, విజయం ఎలా చేకూరతాయో విశదపరుస్తుంది. మానసిక వికాసం, ప్రజ్ఞలతో తేజస్సు నలుదిశలా వ్యాపిస్తుందని, మనిషిని ఉన్నతుడిని చేస్తుందని తెలుపుతుందీ రచన. వృద్ధాప్యంలో మరణభయంతో కుంగిపోకుండా నిశ్చల మనస్సుతో, నమ్మకంతో బతికే సాధన నేర్పుతుంది. ధ్యాన సాధనతో స్థితప్రజ్ఞత సాధించాలని, సంతోషంగా జీవించాలని నేర్పుతుంది. శరీరంలోని 72 నాడులు ఎలా ఉపయోగపడతాయో అలా జీవితానికి 'జీవనాడి' ఉపయోగపడుతుంది. ఈ పుస్తకాన్ని సావధానతతో చదివి, అవగాహనతో ఆకళింపు జేసుకుని జీవితాలకు అన్వయించుకుని ఈ రచనను సార్థక పరుస్తారని ఆశిస్తాను.© 2017,www.logili.com All Rights Reserved.