“నిన్ను నీవు తెలుసుకో” (Self Awareness) ఈ పుస్తకాన్ని వ్రాయుటకు నాకు 2 సంవత్సరముల పైన సమయం పట్టింది. నాకు కాలేజీ రోజుల నుండి వ్రాసే అలవాటు ఉంది. నాటకాలు వెయ్యటం, సేవా కార్యక్రమాలలో పాల్గొనటం, ఎస్.ఎఫ్.ఐ.లో చురుకైన పాత్ర పోషించుట నాకిష్టం.
మా స్వగ్రామమైన పెదపాలపర్రు (గుడివాడ తాలూకా, కృష్ణా జిల్లా)లో ఉన్నత కుటుంబాలలో మా కుటుంబం ఒకటి. గౌరవప్రదమైన స్థితిలో పెరిగి, మెకానికల్ ఇంజనీర్ నయ్యా ను. మద్రాసులో AMIE, MIE (Mechanical Engineering) గుడివాడలో B.A. చదివాను.
ఈ పుస్తకానికి కావలసిన సమాచారమంతా శాండియాగోలో (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.) పుస్తక పఠనం మరియు నా అనుభవం ద్వారా గ్రహించాను. చాలా విషయాలు ఆధ్యాత్మిక చింతనకు, మానసిక వికాసానికి, మనసును కేంద్రీకరించి, జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అనే విషయాలు తేటతెల్లమౌతాయి. మనసును స్వాధీనంలో ఉంచుకోవటం, స్థితప్రజ్ఞత సాధించుట ఎలాగో సాధన ద్వారా నేర్చుకోవచ్చును. మనసును శుద్ధి చేయుట, మానసిక స్పందనలను స్వాధీనంలో ఉంచుకుని, జీవితాన్ని సుఖమయం చేయుట ఎలాగో బోధపడుతుంది. అరిషడ్వరాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అదుపులో ఉంచుకుని మనసును ఎలా స్వాధీన పర్చుకోవాలో ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటారు.
చల్లగుళ్ల నాగేశ్వరరావు
“నిన్ను నీవు తెలుసుకో” (Self Awareness) ఈ పుస్తకాన్ని వ్రాయుటకు నాకు 2 సంవత్సరముల పైన సమయం పట్టింది. నాకు కాలేజీ రోజుల నుండి వ్రాసే అలవాటు ఉంది. నాటకాలు వెయ్యటం, సేవా కార్యక్రమాలలో పాల్గొనటం, ఎస్.ఎఫ్.ఐ.లో చురుకైన పాత్ర పోషించుట నాకిష్టం. మా స్వగ్రామమైన పెదపాలపర్రు (గుడివాడ తాలూకా, కృష్ణా జిల్లా)లో ఉన్నత కుటుంబాలలో మా కుటుంబం ఒకటి. గౌరవప్రదమైన స్థితిలో పెరిగి, మెకానికల్ ఇంజనీర్ నయ్యా ను. మద్రాసులో AMIE, MIE (Mechanical Engineering) గుడివాడలో B.A. చదివాను. ఈ పుస్తకానికి కావలసిన సమాచారమంతా శాండియాగోలో (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.) పుస్తక పఠనం మరియు నా అనుభవం ద్వారా గ్రహించాను. చాలా విషయాలు ఆధ్యాత్మిక చింతనకు, మానసిక వికాసానికి, మనసును కేంద్రీకరించి, జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అనే విషయాలు తేటతెల్లమౌతాయి. మనసును స్వాధీనంలో ఉంచుకోవటం, స్థితప్రజ్ఞత సాధించుట ఎలాగో సాధన ద్వారా నేర్చుకోవచ్చును. మనసును శుద్ధి చేయుట, మానసిక స్పందనలను స్వాధీనంలో ఉంచుకుని, జీవితాన్ని సుఖమయం చేయుట ఎలాగో బోధపడుతుంది. అరిషడ్వరాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అదుపులో ఉంచుకుని మనసును ఎలా స్వాధీన పర్చుకోవాలో ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటారు. చల్లగుళ్ల నాగేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.