కుసుమ ధర్మన్న రచనలోని దళిత దృక్పథాన్ని వెలికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నమే ఈ రచన. తెలుగు దళిత సమాజంలో వైతాళికుడయిన ధర్మన్న నిమ్న జాతిని జాగృతం చేసిన వైనాన్ని వివరించారు. దళితుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు ధర్మన్న వృత్తిరీత్యా వైద్యుడయిన, గాయకుడయ్యాడు. రాజకీయ నాయకుడయ్యాడు. పాత్రికేయుడయ్యాడు. బ్యాంకర్ అయ్యాడు. రచయిత అయిన ధర్మన్న, మాకొద్దీ నల్ల దొరతనమంటూ, మాకొద్దీ తెల్లదొరతనమని తెల్లదొరలను పారద్రోలేందుకు పోరాడే వారినే ఎదిరించి నిలిచాడు. నల్లదొరల దాష్టీకాన్ని ఎండగట్టాడు. కల్లు మానమంటూ దళితులకు మద్యపాన నిషేధాన్ని బోధించాడు. హరిజనులను ఉత్తేజపరిచేందుకు హరిజన శతకాన్ని రచించాడు.
మద్దుకూరి సత్యనారాయణ గారు కుసుమ ధర్మన్న దళితుల అభ్యున్నతికి రాజకీయాలలో జోక్యం చేసుకున్న వైనాన్ని, రచనా కృషిని, గేయ రచనలు చేసి ఆలపించిన తీరును, ఉపన్యాసాలతో ఉర్రూతలూగించిన విధానాన్ని మనకు ఈ పరిశోధన గ్రంథంలో నిరూపించారు.
కుసుమ ధర్మన్న రచనలోని దళిత దృక్పథాన్ని వెలికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నమే ఈ రచన. తెలుగు దళిత సమాజంలో వైతాళికుడయిన ధర్మన్న నిమ్న జాతిని జాగృతం చేసిన వైనాన్ని వివరించారు. దళితుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు ధర్మన్న వృత్తిరీత్యా వైద్యుడయిన, గాయకుడయ్యాడు. రాజకీయ నాయకుడయ్యాడు. పాత్రికేయుడయ్యాడు. బ్యాంకర్ అయ్యాడు. రచయిత అయిన ధర్మన్న, మాకొద్దీ నల్ల దొరతనమంటూ, మాకొద్దీ తెల్లదొరతనమని తెల్లదొరలను పారద్రోలేందుకు పోరాడే వారినే ఎదిరించి నిలిచాడు. నల్లదొరల దాష్టీకాన్ని ఎండగట్టాడు. కల్లు మానమంటూ దళితులకు మద్యపాన నిషేధాన్ని బోధించాడు. హరిజనులను ఉత్తేజపరిచేందుకు హరిజన శతకాన్ని రచించాడు. మద్దుకూరి సత్యనారాయణ గారు కుసుమ ధర్మన్న దళితుల అభ్యున్నతికి రాజకీయాలలో జోక్యం చేసుకున్న వైనాన్ని, రచనా కృషిని, గేయ రచనలు చేసి ఆలపించిన తీరును, ఉపన్యాసాలతో ఉర్రూతలూగించిన విధానాన్ని మనకు ఈ పరిశోధన గ్రంథంలో నిరూపించారు.© 2017,www.logili.com All Rights Reserved.