'దళిత ఉద్యమం కమ్యూనిస్టులకు ఎంత నేర్పిందో ఏం నేర్పిందో గానీ, రాజ్యాధికారం అన్ని సమస్యల పరిష్కారానికి నాంది అన్న అభిప్రాయాన్ని కమ్యూనిస్టుల నుండి తాను స్వీకరించి నష్టపోయింది. దళిత ఉద్యమకారులు ఈ అభిప్రాయాన్ని అంబేద్కర్ కు ఆపాదిస్తున్నారు కానీ, ఆయన దళితులు రాజ్యాధికారం చలాయించాలని చెప్పినప్పటికీ అదే ఆయన ఆలోచనలకు కేంద్రం కాదు. అంబేద్కర్, పెరియార్, పూలే ముగ్గురూ రాజకీయ మార్పుల కంటే సాంఘిక మార్పుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆ దిశగా ఆలోచనలను అభివృద్ధి చేసే బదులు రాజ్యాధికారం అన్న భావనకు పెద్దపీట వేసి దానికి అనుగుణమైన వ్యూహాల, ఎత్తుగడల వేటలో దళిత ఉద్యమం పడింది. దానివాల్ల నిజంగా కొత్తవయిన పోరాట రూపాలను సహితం దళిత ఉద్యమం ఆవిష్కరించలేకపోయింది.'
- కె బాలగోపాల్
'దళిత ఉద్యమం కమ్యూనిస్టులకు ఎంత నేర్పిందో ఏం నేర్పిందో గానీ, రాజ్యాధికారం అన్ని సమస్యల పరిష్కారానికి నాంది అన్న అభిప్రాయాన్ని కమ్యూనిస్టుల నుండి తాను స్వీకరించి నష్టపోయింది. దళిత ఉద్యమకారులు ఈ అభిప్రాయాన్ని అంబేద్కర్ కు ఆపాదిస్తున్నారు కానీ, ఆయన దళితులు రాజ్యాధికారం చలాయించాలని చెప్పినప్పటికీ అదే ఆయన ఆలోచనలకు కేంద్రం కాదు. అంబేద్కర్, పెరియార్, పూలే ముగ్గురూ రాజకీయ మార్పుల కంటే సాంఘిక మార్పుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆ దిశగా ఆలోచనలను అభివృద్ధి చేసే బదులు రాజ్యాధికారం అన్న భావనకు పెద్దపీట వేసి దానికి అనుగుణమైన వ్యూహాల, ఎత్తుగడల వేటలో దళిత ఉద్యమం పడింది. దానివాల్ల నిజంగా కొత్తవయిన పోరాట రూపాలను సహితం దళిత ఉద్యమం ఆవిష్కరించలేకపోయింది.' - కె బాలగోపాల్© 2017,www.logili.com All Rights Reserved.