బడిపై నాకలవడిన భక్తిరసమే ప్రధానంగా, విద్యార్థి జీవిత స్మృతులు నింపే ఆనందమే నిధానంగా, నాట్యకళాభిమానమే ఆసరాగా, నా అనుభూతులను నివేదించా. తదాశ్రమ దినాలుస్మృతిపథంలోకి వస్తే, తీగకు లేజిగురుదయించినట్టు, మనసు పునర్వికాసం చెందే, సౌరభ్యం సంస్కారవాసనలు ఉడుగని సహృదయ సంపన్నులు పఠీత్రులోకంలో గుప్పెడున్నా, వారే నాకు పదికోట్లు. వారివారి వృత్త్యుద్యోగవిహిత కృత్యనిర్వహణానంతర సమయాల్లో, వారికీ బాలవ్యాసాంగం, ఏ పదినిమిషాల పాటు, విశ్రామ సమయ పఠనోపయుక్తమైనా నాయీ కృషి సత్ప్రయోజనకారి అయినట్టే భావిస్తా. మరి విద్యాజగత్తులో, ఏ పదిమంది విద్యార్థులకీ రచన, క్రమనిష్టాభినివేశ చిత్తత, సోదర విద్యార్థుల పట్ల సహృద్భావం, ఆచార్యుల పట్ల సద్వినయ సౌశీల్యం, బడిపట్ల భక్తీప్రపత్తులు ఉద్భోధించగల్గిన నేను సార్థకజనుణ్ణి అయితినని సంతసిస్తా.
బడిపై నాకలవడిన భక్తిరసమే ప్రధానంగా, విద్యార్థి జీవిత స్మృతులు నింపే ఆనందమే నిధానంగా, నాట్యకళాభిమానమే ఆసరాగా, నా అనుభూతులను నివేదించా. తదాశ్రమ దినాలుస్మృతిపథంలోకి వస్తే, తీగకు లేజిగురుదయించినట్టు, మనసు పునర్వికాసం చెందే, సౌరభ్యం సంస్కారవాసనలు ఉడుగని సహృదయ సంపన్నులు పఠీత్రులోకంలో గుప్పెడున్నా, వారే నాకు పదికోట్లు. వారివారి వృత్త్యుద్యోగవిహిత కృత్యనిర్వహణానంతర సమయాల్లో, వారికీ బాలవ్యాసాంగం, ఏ పదినిమిషాల పాటు, విశ్రామ సమయ పఠనోపయుక్తమైనా నాయీ కృషి సత్ప్రయోజనకారి అయినట్టే భావిస్తా. మరి విద్యాజగత్తులో, ఏ పదిమంది విద్యార్థులకీ రచన, క్రమనిష్టాభినివేశ చిత్తత, సోదర విద్యార్థుల పట్ల సహృద్భావం, ఆచార్యుల పట్ల సద్వినయ సౌశీల్యం, బడిపట్ల భక్తీప్రపత్తులు ఉద్భోధించగల్గిన నేను సార్థకజనుణ్ణి అయితినని సంతసిస్తా.© 2017,www.logili.com All Rights Reserved.