ప్రవేశిక
సమాజచరిత్రలో గాని, సాహిత్యచరిత్రలో గాని నిశ్శబ్దకృషి చేసి, కాలంలో కరిగిపోయే దొడ్డ మనుషులుంటారు. పైపైన చూస్తే వాళ్లు ఉన్నత శిఖరాలకి మల్లే కనబడరు. లోతైన సంద్రాలు మాదిరిగానూ కనపడరు. సాహిత్యలోకం సాధారణంగా శిఖరాలను మాత్రమే గుర్తించి, గౌరవిస్తుంది. కనుక సామాన్యులుగా కనపడే అసామాన్యులకు చాల సందర్భాల్లో సరియైన గుర్తింపు రాదు.
తెలుగు సాహిత్యచరిత్రలో అట్లాంటి నిశ్శబ్దకృషి చేసిన ఉత్తమ కథకుడు మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే. ఆయన కథలకు తగినంత ప్రచారం రాలేదు. ప్రత్యేకించి ఒకే ప్రాంతానికి సంబంధించిన రచనలు చెయ్యటం ఒక కారణమై ఉండవచ్చు. సర్వ సాధారణ రచయితల భాషలో వ్రాయకపోవటం మరొక కారణమై ఉండవచ్చు. ఏది ఏమైనా తెలుగు సాహిత్యచరిత్రలో ఒకానొక ఉపేక్షిత రచయిత ఆయన.
‘మా గోఖలే' అని రచనల్లో, చిత్రపటాల్లో తనకు తానే వ్యవహరించుకొన్న మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరులో సంప్రదాయ బ్రాహ్మణకుటుంబంలో 7-3-1917 నాడు పుట్టటం, 4-10-1981 నాడు కాలధర్మం చెందటం యాదృచ్ఛిక సంఘటన. 1940-70 మధ్య కాలంలోని గుంటూరు ప్రాంతపు గ్రామీణ జీవితంలోని వెలుగునీడల్ని కమనీయ కథాఖండాలుగా మలచటం విలక్షణ సంఘటన.
మాధవపెద్ది గోఖలే రచనా దృక్పథాన్ని బహుశా రెండు విషయాలు ప్రభావితం చేసి ఉండాలి. తన తండ్రి లక్ష్మీనరసయ్య స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నవాడు. జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఈ క్రమంలో ఆస్తిపాస్తులన్నీ హరించుకుపోయాయి. పదేళ్ల ప్రాయం దాక గోఖలే చదువు బ్రాహ్మణకోడూరులోనే సాగింది. తర్వాత చిత్రలేఖనంపై ఆసక్తితో బందరు వెళ్లాడు. అక్కడ ప్రమోద్కుమార్ వద్ద చిత్రకళ కొంత నేర్చాడు. పిమ్మట మద్రాసులోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ప్రసిద్ధ చిత్రకారుడు దేవీప్రసాద్ రాయ్ చౌధురి దగ్గర చిత్రకళ లోతుగా నేర్చుకున్నాడు.....................
ప్రవేశిక సమాజచరిత్రలో గాని, సాహిత్యచరిత్రలో గాని నిశ్శబ్దకృషి చేసి, కాలంలో కరిగిపోయే దొడ్డ మనుషులుంటారు. పైపైన చూస్తే వాళ్లు ఉన్నత శిఖరాలకి మల్లే కనబడరు. లోతైన సంద్రాలు మాదిరిగానూ కనపడరు. సాహిత్యలోకం సాధారణంగా శిఖరాలను మాత్రమే గుర్తించి, గౌరవిస్తుంది. కనుక సామాన్యులుగా కనపడే అసామాన్యులకు చాల సందర్భాల్లో సరియైన గుర్తింపు రాదు. తెలుగు సాహిత్యచరిత్రలో అట్లాంటి నిశ్శబ్దకృషి చేసిన ఉత్తమ కథకుడు మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే. ఆయన కథలకు తగినంత ప్రచారం రాలేదు. ప్రత్యేకించి ఒకే ప్రాంతానికి సంబంధించిన రచనలు చెయ్యటం ఒక కారణమై ఉండవచ్చు. సర్వ సాధారణ రచయితల భాషలో వ్రాయకపోవటం మరొక కారణమై ఉండవచ్చు. ఏది ఏమైనా తెలుగు సాహిత్యచరిత్రలో ఒకానొక ఉపేక్షిత రచయిత ఆయన. ‘మా గోఖలే' అని రచనల్లో, చిత్రపటాల్లో తనకు తానే వ్యవహరించుకొన్న మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరులో సంప్రదాయ బ్రాహ్మణకుటుంబంలో 7-3-1917 నాడు పుట్టటం, 4-10-1981 నాడు కాలధర్మం చెందటం యాదృచ్ఛిక సంఘటన. 1940-70 మధ్య కాలంలోని గుంటూరు ప్రాంతపు గ్రామీణ జీవితంలోని వెలుగునీడల్ని కమనీయ కథాఖండాలుగా మలచటం విలక్షణ సంఘటన. మాధవపెద్ది గోఖలే రచనా దృక్పథాన్ని బహుశా రెండు విషయాలు ప్రభావితం చేసి ఉండాలి. తన తండ్రి లక్ష్మీనరసయ్య స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నవాడు. జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఈ క్రమంలో ఆస్తిపాస్తులన్నీ హరించుకుపోయాయి. పదేళ్ల ప్రాయం దాక గోఖలే చదువు బ్రాహ్మణకోడూరులోనే సాగింది. తర్వాత చిత్రలేఖనంపై ఆసక్తితో బందరు వెళ్లాడు. అక్కడ ప్రమోద్కుమార్ వద్ద చిత్రకళ కొంత నేర్చాడు. పిమ్మట మద్రాసులోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ప్రసిద్ధ చిత్రకారుడు దేవీప్రసాద్ రాయ్ చౌధురి దగ్గర చిత్రకళ లోతుగా నేర్చుకున్నాడు.....................© 2017,www.logili.com All Rights Reserved.