మనిషి మనిషిగా ప్రవర్తించినప్పుడు.. మనిషిని మనిషిగా గుర్తించినప్పుడు సమస్యలు రావు. దాన్ని మనం ఈ అత్యాధునిక వైజ్ఞానిక సమాజంలో సాధించాల్సి ఉంది. విభజనలు మాని, సమానత్వం కోసం, మానవాళి ఐక్యత కోసం, మానవత్వ స్థాపన కోసం కృషి చేయాల్సి ఉంది. మనిషి బలహీనతకూ బలానికీ మధ్య ఘర్షణ, మనిషి మూఢవిశ్వాసానికీ ఆత్మావిశ్వాసానికీ ఘర్షణ. భ్రమలకూ వాస్తవాలకూ మధ్య ఘర్షణ. అయితే ఒకటి మాత్రం నిజం! మనిషి తన బలహీనతల మీద, భ్రమల మీద, ఊహల మీద, కల్పనల మీద, అజ్ఞానం మీద, అమాయకత్వం మీద, మూఢత్వం మీద మాత్రమే పూర్తిగా ఆధారపడితే సమాజం ఇంత ప్రగతిపథానికి వచ్చేది కాదు. వాటన్నింటినీ పూర్తిగా పక్కకు నెట్టేస్తూ మనిషి సత్యశోధన చేస్తూనే వచ్చాడు కాబట్టి, నేటి ఈ ఇరవై ఒకటవ వైజ్ఞానిక శతాబ్దంలోకి అడుగుపెట్టాడు.
ప్రముఖ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ దేవరాజు మహారాజు గత యాభైయేళ్ళకు పైగా రచనలు ప్రకటిస్తూనే ఉన్నారు. అన్ని సాహితీ ప్రక్రియల్లో సుమారు అరవై రెండు పురస్కారాలందుకున్నారు. అందులో సరళ వైజ్ఞానిక రచనలకు అందుకున్నది కూడా ఒకటి! మూఢనమ్మకాల నిర్మూలనకు తన కలం కొరడా ఝుళిపిస్తూనే, సమాజంలో హేతుబద్ధత, సామాన్యుడిలో శాస్త్రీయ అవగాహన పెరగాలని నిరంతరం తపిస్తున్న నిత్యకృషీవలుడు.
మనిషి మనిషిగా ప్రవర్తించినప్పుడు.. మనిషిని మనిషిగా గుర్తించినప్పుడు సమస్యలు రావు. దాన్ని మనం ఈ అత్యాధునిక వైజ్ఞానిక సమాజంలో సాధించాల్సి ఉంది. విభజనలు మాని, సమానత్వం కోసం, మానవాళి ఐక్యత కోసం, మానవత్వ స్థాపన కోసం కృషి చేయాల్సి ఉంది. మనిషి బలహీనతకూ బలానికీ మధ్య ఘర్షణ, మనిషి మూఢవిశ్వాసానికీ ఆత్మావిశ్వాసానికీ ఘర్షణ. భ్రమలకూ వాస్తవాలకూ మధ్య ఘర్షణ. అయితే ఒకటి మాత్రం నిజం! మనిషి తన బలహీనతల మీద, భ్రమల మీద, ఊహల మీద, కల్పనల మీద, అజ్ఞానం మీద, అమాయకత్వం మీద, మూఢత్వం మీద మాత్రమే పూర్తిగా ఆధారపడితే సమాజం ఇంత ప్రగతిపథానికి వచ్చేది కాదు. వాటన్నింటినీ పూర్తిగా పక్కకు నెట్టేస్తూ మనిషి సత్యశోధన చేస్తూనే వచ్చాడు కాబట్టి, నేటి ఈ ఇరవై ఒకటవ వైజ్ఞానిక శతాబ్దంలోకి అడుగుపెట్టాడు. ప్రముఖ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ దేవరాజు మహారాజు గత యాభైయేళ్ళకు పైగా రచనలు ప్రకటిస్తూనే ఉన్నారు. అన్ని సాహితీ ప్రక్రియల్లో సుమారు అరవై రెండు పురస్కారాలందుకున్నారు. అందులో సరళ వైజ్ఞానిక రచనలకు అందుకున్నది కూడా ఒకటి! మూఢనమ్మకాల నిర్మూలనకు తన కలం కొరడా ఝుళిపిస్తూనే, సమాజంలో హేతుబద్ధత, సామాన్యుడిలో శాస్త్రీయ అవగాహన పెరగాలని నిరంతరం తపిస్తున్న నిత్యకృషీవలుడు.© 2017,www.logili.com All Rights Reserved.