ముందుమాట
'పారనాయిడ్ స్కిజోఫ్రీనియా'లో మన నాయకులు
“పారానాయిడ్ స్కిజోఫ్రీనియా' - అనేది భ్రమల్లో బతికే ఒక మానసిక వ్యాధి. ఆ వ్యాధితో ఉన్నవారికి తాము అందులో బతుకుతున్నామని తెలియదు. తెలుసుకునే ప్రయత్నమూ చేయలేరు. సహృదయులెవరైనా సహనంతో వారిని దగ్గరకు తీసుకుని, అందులోంచి వారు బయటపడే విధంగా ప్రయత్నించాలి. ఈ వ్యాధితో ఉన్నవారికి వారి అహంకారమే వారికి ముఖ్యం. తమ గురించి తాము అతిశయోక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిలో ప్రధానులు, మంత్రులు, యం.పి.లు ఇతర వివిఐపిలు ఎందరో వున్నారు. వాస్తవాలు ఒకరకంగా ఉంటే, వీరు చెప్పే విషయాలు మరోరకంగా ఉంటాయి. తిమ్మిని బమ్మి చేయడం, మభ్యపెట్టడం, తమ అభూత కల్పనల్ని నమ్మమనడం వగైరా చేస్తుంటారు. వారిని, వారి మాటల్లోని డొల్లతనాన్ని నమ్మేవారు జనంలో కొంతమంది ఉన్నా- విషయాన్ని విడమరిచి విశ్లేషించుకుని, అర్థం చేసుకునేవారు చాలామందే వున్నారు. వారికి వెన్నుదన్నుగా బాధ్యతగా పనిచేస్తున్న రచయితలు, ఉపాధ్యాయులు, జర్నలిస్టు, సైన్సు కార్యకర్తలు ఉండనే ఉన్నారు.
ఎవరైనా సరే, తమకు తమ అహమే ముఖ్యం - అనే భావనను వదులుకుంటేనే వారు విశాల దృక్పథంలోకి ప్రవేశించగలుగుతారు. అప్పుడే వారికి సంక్లిష్టమైన విషయాల న్నింటినీ విశ్లేషించుకునే స్తోమత వస్తుంది. ప్రపంచం గురించి, ప్రపంచంలోని జాతుల గురించి, వారి హక్కుల గురించి, విధుల గురించి తెలుసుకున్నప్పుడే లోకజ్ఞానం పెరుగుతుంది. మత విశ్వాసం పెంచుకున్నవాడు తన అజ్ఞానంలో తనే కుంచించుకు పోతాడు. సరైన వాస్తవాలు, రుజువులు, కనబడుతున్నా జీర్ణించుకోలేడు. మనిషిలోని సహనం-విషయం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడాలి. అర్ధం చేసుకోవడానికి మానసిక పరిపక్వత కావాలి. ఆ మానసిక పరిపక్వత లేకపోవడం వల్లనే ఎవడో దద్దమ్మ.......
ముందుమాట 'పారనాయిడ్ స్కిజోఫ్రీనియా'లో మన నాయకులు “పారానాయిడ్ స్కిజోఫ్రీనియా' - అనేది భ్రమల్లో బతికే ఒక మానసిక వ్యాధి. ఆ వ్యాధితో ఉన్నవారికి తాము అందులో బతుకుతున్నామని తెలియదు. తెలుసుకునే ప్రయత్నమూ చేయలేరు. సహృదయులెవరైనా సహనంతో వారిని దగ్గరకు తీసుకుని, అందులోంచి వారు బయటపడే విధంగా ప్రయత్నించాలి. ఈ వ్యాధితో ఉన్నవారికి వారి అహంకారమే వారికి ముఖ్యం. తమ గురించి తాము అతిశయోక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిలో ప్రధానులు, మంత్రులు, యం.పి.లు ఇతర వివిఐపిలు ఎందరో వున్నారు. వాస్తవాలు ఒకరకంగా ఉంటే, వీరు చెప్పే విషయాలు మరోరకంగా ఉంటాయి. తిమ్మిని బమ్మి చేయడం, మభ్యపెట్టడం, తమ అభూత కల్పనల్ని నమ్మమనడం వగైరా చేస్తుంటారు. వారిని, వారి మాటల్లోని డొల్లతనాన్ని నమ్మేవారు జనంలో కొంతమంది ఉన్నా- విషయాన్ని విడమరిచి విశ్లేషించుకుని, అర్థం చేసుకునేవారు చాలామందే వున్నారు. వారికి వెన్నుదన్నుగా బాధ్యతగా పనిచేస్తున్న రచయితలు, ఉపాధ్యాయులు, జర్నలిస్టు, సైన్సు కార్యకర్తలు ఉండనే ఉన్నారు. ఎవరైనా సరే, తమకు తమ అహమే ముఖ్యం - అనే భావనను వదులుకుంటేనే వారు విశాల దృక్పథంలోకి ప్రవేశించగలుగుతారు. అప్పుడే వారికి సంక్లిష్టమైన విషయాల న్నింటినీ విశ్లేషించుకునే స్తోమత వస్తుంది. ప్రపంచం గురించి, ప్రపంచంలోని జాతుల గురించి, వారి హక్కుల గురించి, విధుల గురించి తెలుసుకున్నప్పుడే లోకజ్ఞానం పెరుగుతుంది. మత విశ్వాసం పెంచుకున్నవాడు తన అజ్ఞానంలో తనే కుంచించుకు పోతాడు. సరైన వాస్తవాలు, రుజువులు, కనబడుతున్నా జీర్ణించుకోలేడు. మనిషిలోని సహనం-విషయం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడాలి. అర్ధం చేసుకోవడానికి మానసిక పరిపక్వత కావాలి. ఆ మానసిక పరిపక్వత లేకపోవడం వల్లనే ఎవడో దద్దమ్మ.......© 2017,www.logili.com All Rights Reserved.