ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో 74 గ్రామాలను సమగ్రంగా సర్వే చేసే కార్యక్రమాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రం 2013 - 14 లో చేపట్టింది. దాదాపు 50 మంది వలంటీర్లు సమాచార సేకరణలో పాల్గొన్నారు. ఈ సమాచారాన్నంతటిని క్రోడీకరించి, పరిశీలనకు పనికి వచ్చే విధంగా పట్టికలు తయారు చేసే కృషిలో 10 మందికి పైగా పరిశోధకులు పనిచేస్తున్నారు. ఇదంతా గణాంకాల వ్యవహారం. అది త్వరలోనే ప్రచురించబడుతుంది. కాని గణాంకాలలో ప్రతిబింబించని కుల వ్యవస్థ, కులవివక్ష లాంటి సామాజిక అంశాలను, ఇతర రాజకీయ అంశాలను ప్రత్యేక్ష పరిశీలన ద్వారాను, చర్చలు, ఇంటర్వ్యూలు ద్వారాను తెలుసుకొని వాటిని వ్యాసాల రూపంలో ఈ పుస్తకంలో పొందుపరిచారు.
గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలోని వివిధ కోణాలు, వందల సంవత్సరాలుగా ఘనీభవించిపోయిన భూస్వామ్య దోపిడీ సంబంధాలతో పాటు, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తపుంతలు తొక్కుతున్న నూతన ఆధిపత్య, దోపిడీ సంబంధాలను కూడా ఈ పరిశోధన వెల్లడిస్తుంది. ఓ వైపున పెట్టుబడీదారీ సంబంధాలు అభివృద్ధి చెందిన, మరోవైపున అంటరానితనం, కులవివక్ష కొనసాగుతున్న గ్రామీణ వాస్తవాన్ని ఈ పుస్తకం వెల్లడిస్తుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో 74 గ్రామాలను సమగ్రంగా సర్వే చేసే కార్యక్రమాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రం 2013 - 14 లో చేపట్టింది. దాదాపు 50 మంది వలంటీర్లు సమాచార సేకరణలో పాల్గొన్నారు. ఈ సమాచారాన్నంతటిని క్రోడీకరించి, పరిశీలనకు పనికి వచ్చే విధంగా పట్టికలు తయారు చేసే కృషిలో 10 మందికి పైగా పరిశోధకులు పనిచేస్తున్నారు. ఇదంతా గణాంకాల వ్యవహారం. అది త్వరలోనే ప్రచురించబడుతుంది. కాని గణాంకాలలో ప్రతిబింబించని కుల వ్యవస్థ, కులవివక్ష లాంటి సామాజిక అంశాలను, ఇతర రాజకీయ అంశాలను ప్రత్యేక్ష పరిశీలన ద్వారాను, చర్చలు, ఇంటర్వ్యూలు ద్వారాను తెలుసుకొని వాటిని వ్యాసాల రూపంలో ఈ పుస్తకంలో పొందుపరిచారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలోని వివిధ కోణాలు, వందల సంవత్సరాలుగా ఘనీభవించిపోయిన భూస్వామ్య దోపిడీ సంబంధాలతో పాటు, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తపుంతలు తొక్కుతున్న నూతన ఆధిపత్య, దోపిడీ సంబంధాలను కూడా ఈ పరిశోధన వెల్లడిస్తుంది. ఓ వైపున పెట్టుబడీదారీ సంబంధాలు అభివృద్ధి చెందిన, మరోవైపున అంటరానితనం, కులవివక్ష కొనసాగుతున్న గ్రామీణ వాస్తవాన్ని ఈ పుస్తకం వెల్లడిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.