గద్వాల సాహిత్య పాఠశాల ప్రసంగ వ్యాసం
మతవర్గ తత్వం సమీక్ష
ఏ మతవర్గ తత్వానికైనా సరే, మతమనే దానిలోనే మూలం వుందనుకోవడం అసమంజసం.
మతభావం ఆదిమ మానవసమాజం అసహాయస్థితిలోనే ఏర్పడిన చిత్తభ్రమ. తాను ప్రకృతిలో అంతర్భాగంగా వుంటూనే బాహిర ప్రకృతి తోటి నిత్యజీవనోపాధికోసం ఒక చెంపను పోరాటం సాగిస్తూ, ఇంకొక చెంపను సహకార వైఖరిని అవలంబిస్తూ, ఆదిమ మానవసమాజం తన స్వాధీనంకాని భౌతికశక్తుల ముందు తన దౌర్బల్యాన్ని అనేక రూపాలలో ప్రదర్శించింది. వాటిలో మతభావం ఒకానొకటి. ప్రకృతిశక్తులు బలాధిక్యత వాటికి దైవత్వాన్ని ఆపాదింపజేసింది. అదేసమయంలో, ఈ దైవత్వం మానవాకృతిని పొందింది. దీన్ని ఇంగ్లీషులో Anthropomorphism అంటారు. మరొకవైపున, సమస్త చరాచర ప్రకృతీ ప్రాణవంతమేనన్న జ్ఞానం Animism అనిపించుకుంది. తర్వాత, మానవ మర్మాంగాలలో సృష్టి కార్యాన్ని అర్ధం చేసుకునే క్రమంలో యోనిపూజ మొదలైంది. వామాచారానికి ఇదే మూలం. fertility cults కు గూడా దారితీసింది.
ఇంకో విశేషం ఏమిటంటే, ఆదిమ సమాజాలలోని వ్యక్తుల మధ్యగల సంబంధాలను గాఢతరంచేసే ఒక cementing forceగా కూడా మత విశ్వాసం పనికివచ్చింది. గణాలూ, గోత్రాలూ గ్రామాలూ యీ విధంగా రూపొందినవే. మనం 'కుదుళ్ళు' అని వాడుతూన్నమాట దీనికి బాగా సరిపోతుంది.
'మతం ప్రజల పాలిటి మత్తుమందు' అని మార్చ్ రాసినప్పుడు, మనస్సులను జోకొట్టి చైతన్యాన్ని మందగింపజేసి అజ్ఞానంలో అట్టిపెట్టేదని మనలో అనేకులం ఇంకా భావిస్తున్న దాన్ని మార్చ్ ఉద్దేశించలేదు. ప్రకృతితోటి తొలిమానవుడు సలపకతప్పని పోరాటంలో భౌతికశక్తుల ప్రాబల్యానికి తలవంచవలసిన పరిస్థితిలో అతనికి ఊరట కొలిపేదీ, కష్టనష్టాలవల్ల దుఃఖపడే మనిషి కన్నీళ్ళు తుడిచేదీ, అపజయాల పరంపర మూలంగా కలిగే నిరాశా నిస్పృహలను తాత్కాలికంగా మరపింపజేసేదీ మతమేనని మార్క్స్ భావం.................
గద్వాల సాహిత్య పాఠశాల ప్రసంగ వ్యాసం మతవర్గ తత్వం సమీక్ష ఏ మతవర్గ తత్వానికైనా సరే, మతమనే దానిలోనే మూలం వుందనుకోవడం అసమంజసం. మతభావం ఆదిమ మానవసమాజం అసహాయస్థితిలోనే ఏర్పడిన చిత్తభ్రమ. తాను ప్రకృతిలో అంతర్భాగంగా వుంటూనే బాహిర ప్రకృతి తోటి నిత్యజీవనోపాధికోసం ఒక చెంపను పోరాటం సాగిస్తూ, ఇంకొక చెంపను సహకార వైఖరిని అవలంబిస్తూ, ఆదిమ మానవసమాజం తన స్వాధీనంకాని భౌతికశక్తుల ముందు తన దౌర్బల్యాన్ని అనేక రూపాలలో ప్రదర్శించింది. వాటిలో మతభావం ఒకానొకటి. ప్రకృతిశక్తులు బలాధిక్యత వాటికి దైవత్వాన్ని ఆపాదింపజేసింది. అదేసమయంలో, ఈ దైవత్వం మానవాకృతిని పొందింది. దీన్ని ఇంగ్లీషులో Anthropomorphism అంటారు. మరొకవైపున, సమస్త చరాచర ప్రకృతీ ప్రాణవంతమేనన్న జ్ఞానం Animism అనిపించుకుంది. తర్వాత, మానవ మర్మాంగాలలో సృష్టి కార్యాన్ని అర్ధం చేసుకునే క్రమంలో యోనిపూజ మొదలైంది. వామాచారానికి ఇదే మూలం. fertility cults కు గూడా దారితీసింది. ఇంకో విశేషం ఏమిటంటే, ఆదిమ సమాజాలలోని వ్యక్తుల మధ్యగల సంబంధాలను గాఢతరంచేసే ఒక cementing forceగా కూడా మత విశ్వాసం పనికివచ్చింది. గణాలూ, గోత్రాలూ గ్రామాలూ యీ విధంగా రూపొందినవే. మనం 'కుదుళ్ళు' అని వాడుతూన్నమాట దీనికి బాగా సరిపోతుంది. 'మతం ప్రజల పాలిటి మత్తుమందు' అని మార్చ్ రాసినప్పుడు, మనస్సులను జోకొట్టి చైతన్యాన్ని మందగింపజేసి అజ్ఞానంలో అట్టిపెట్టేదని మనలో అనేకులం ఇంకా భావిస్తున్న దాన్ని మార్చ్ ఉద్దేశించలేదు. ప్రకృతితోటి తొలిమానవుడు సలపకతప్పని పోరాటంలో భౌతికశక్తుల ప్రాబల్యానికి తలవంచవలసిన పరిస్థితిలో అతనికి ఊరట కొలిపేదీ, కష్టనష్టాలవల్ల దుఃఖపడే మనిషి కన్నీళ్ళు తుడిచేదీ, అపజయాల పరంపర మూలంగా కలిగే నిరాశా నిస్పృహలను తాత్కాలికంగా మరపింపజేసేదీ మతమేనని మార్క్స్ భావం.................© 2017,www.logili.com All Rights Reserved.