డార్లింగ్టన్ సంఘటన
జూలై 1878
ఓక్లహామాలో నడి వేసవిరోజు. లోహనిర్మితమైనట్లున్నది మబ్బుల్లేని ఆకాశం. ఈ క్షణమో మరుక్షణమో మరగకాచిన ఉష్ణద్రవాన్ని వదిలిపెట్టేందుకు సిద్ధపడినట్లు అనిపిస్తున్నది. ఆకాశం నుండి, సూర్యుని నుండి, దక్షిణపవనాలు రేగొట్టిన టెక్సాస్ ఎడారి నుండి, చివరకు భూమి నుండి కూడా ఉడుకు ఎగుస్తూవుంది. పొడిపొడి అయిన నేల అందమైన ఎర్రదుమ్ముగా కరిగిపోతూ వుంది. పైనా, లోనా, ప్రతిఒక్కదానిమీదా ఎర్రదుమ్ము విస్తరించుకుంటూ వుంది. ఎదుగుదల ఆగిపోయిన నల్లని పైన్ చెట్టుమీదా, పసుపువన్నె పచ్చికమీదా పేర్పు కట్టుతూ వుంది. రంగులు అయినా పూయని ఇళ్ళమీద పడుతూవుంది. రూపుచెడిన పెంకుల మీద వాలి. అవి ఇటీవలే ఎందునుండి ఏర్పడినాయో, ఆ భూమికీ, పెంకులకూ చుట్టరికం కలుపుతూ వుంది.
మిడిమేలపు ఎండలో ప్రతిదానికీ అసహజమైన వికార ఆకారం ఏర్పడినట్లే ప్రతిదీ మిలమిలలాడుతూ వుంది. చెట్లులేనిచోట గంతులువేస్తూపోయే ఎలుక వేడిగాడుకు ఎగిరివచ్చిన గోధుమవన్నె గుడ్డపేలికవలే వుంది. ఏజెన్సీ భూములను తనిఖీ చేసేందుకు పొద్దుట బయలుదేరిన ఏజెంట్ జాన్ మైల్స్ కాస్త ఆగాడు. తాను ఆరేళ్ళుగా ఇండియను ప్రదేశంలో వుంటున్నాడుగాని తనకింకా ఓక్లహామా వేసవి మామూలు కాలేదు. నిరుటి వేసవికంటే రానున్న వేసవి మరింత తీవ్రమవుతూ వుంది. నేటి ఎండ ధాటిచూశాక నిరుటి ఎండధాటి మరిచిపోయాడేమో లేకుంటే.
గంజిపెట్టిన మెడపట్టీ లోపల వేలు దూర్చి జాగ్రత్తగా చుట్టూ తడిమి చూసుకున్నాడు. పదకొండు గంటలయిందపుడు. పొద్దు నెత్తిమీదికి వచ్చేసరికి గంజిలోని చివరి బిగువు సడలిచ్చిపోతుంది; కాలు తొక్కతొక్కగా తయారవుతుంది మామూలుగా. అసలు ఎండలున్నంతకాలం ఈ గంజిపెట్టిన తెల్లటి కాలరు వాడడమంత తెలివితక్కువపని మరొకటిలేదని, అతని లూసీ అత్త పదేపదే చెప్పింది. లూసీఅత్త ఈయనగారి భార్యే. దానికిబదులు మెడ రుమాలు కనకవాడితే అది చేతి రుమాలుగా కూడా పనికి వస్తుందట, ఇంతకంటే బాగా వుంటుందట, మరి, ఉద్యోగ ప్రతిష్ఠకు భంగము కలిగించదట.
ఈ చివరి అంశం విషయమై అతనికింకా సంశయాలు నివృత్తి కాలేదు. స్వల్పమైనవి కొన్ని కలిసికొంటేనే ఉద్యోగ ప్రతిష్ఠ అనేది, అధికార హోదా అనేది ఏర్పడుతుంది. వీటిలో............
డార్లింగ్టన్ సంఘటన జూలై 1878 ఓక్లహామాలో నడి వేసవిరోజు. లోహనిర్మితమైనట్లున్నది మబ్బుల్లేని ఆకాశం. ఈ క్షణమో మరుక్షణమో మరగకాచిన ఉష్ణద్రవాన్ని వదిలిపెట్టేందుకు సిద్ధపడినట్లు అనిపిస్తున్నది. ఆకాశం నుండి, సూర్యుని నుండి, దక్షిణపవనాలు రేగొట్టిన టెక్సాస్ ఎడారి నుండి, చివరకు భూమి నుండి కూడా ఉడుకు ఎగుస్తూవుంది. పొడిపొడి అయిన నేల అందమైన ఎర్రదుమ్ముగా కరిగిపోతూ వుంది. పైనా, లోనా, ప్రతిఒక్కదానిమీదా ఎర్రదుమ్ము విస్తరించుకుంటూ వుంది. ఎదుగుదల ఆగిపోయిన నల్లని పైన్ చెట్టుమీదా, పసుపువన్నె పచ్చికమీదా పేర్పు కట్టుతూ వుంది. రంగులు అయినా పూయని ఇళ్ళమీద పడుతూవుంది. రూపుచెడిన పెంకుల మీద వాలి. అవి ఇటీవలే ఎందునుండి ఏర్పడినాయో, ఆ భూమికీ, పెంకులకూ చుట్టరికం కలుపుతూ వుంది. మిడిమేలపు ఎండలో ప్రతిదానికీ అసహజమైన వికార ఆకారం ఏర్పడినట్లే ప్రతిదీ మిలమిలలాడుతూ వుంది. చెట్లులేనిచోట గంతులువేస్తూపోయే ఎలుక వేడిగాడుకు ఎగిరివచ్చిన గోధుమవన్నె గుడ్డపేలికవలే వుంది. ఏజెన్సీ భూములను తనిఖీ చేసేందుకు పొద్దుట బయలుదేరిన ఏజెంట్ జాన్ మైల్స్ కాస్త ఆగాడు. తాను ఆరేళ్ళుగా ఇండియను ప్రదేశంలో వుంటున్నాడుగాని తనకింకా ఓక్లహామా వేసవి మామూలు కాలేదు. నిరుటి వేసవికంటే రానున్న వేసవి మరింత తీవ్రమవుతూ వుంది. నేటి ఎండ ధాటిచూశాక నిరుటి ఎండధాటి మరిచిపోయాడేమో లేకుంటే. గంజిపెట్టిన మెడపట్టీ లోపల వేలు దూర్చి జాగ్రత్తగా చుట్టూ తడిమి చూసుకున్నాడు. పదకొండు గంటలయిందపుడు. పొద్దు నెత్తిమీదికి వచ్చేసరికి గంజిలోని చివరి బిగువు సడలిచ్చిపోతుంది; కాలు తొక్కతొక్కగా తయారవుతుంది మామూలుగా. అసలు ఎండలున్నంతకాలం ఈ గంజిపెట్టిన తెల్లటి కాలరు వాడడమంత తెలివితక్కువపని మరొకటిలేదని, అతని లూసీ అత్త పదేపదే చెప్పింది. లూసీఅత్త ఈయనగారి భార్యే. దానికిబదులు మెడ రుమాలు కనకవాడితే అది చేతి రుమాలుగా కూడా పనికి వస్తుందట, ఇంతకంటే బాగా వుంటుందట, మరి, ఉద్యోగ ప్రతిష్ఠకు భంగము కలిగించదట. ఈ చివరి అంశం విషయమై అతనికింకా సంశయాలు నివృత్తి కాలేదు. స్వల్పమైనవి కొన్ని కలిసికొంటేనే ఉద్యోగ ప్రతిష్ఠ అనేది, అధికార హోదా అనేది ఏర్పడుతుంది. వీటిలో............© 2017,www.logili.com All Rights Reserved.