నేను జర్నలిస్టునేనా ???
- అని నన్ను నేను ప్రశ్నించుకుంటే అది ఆత్మదర్శనం!
నువ్వు జర్నలిస్టువేనా ???
- అని నీవు నన్ను ప్రశ్నిస్తే ... అది పరాభవం!
ఆత్మదర్శనంతో అద్భుతాలు జరక్కపోయినా ఆత్మజ్ఞానం (ఆత్మ అనేది ఒకటుందని తెలుసుకోవడం) ప్రజ్వరిల్లుతుంది. కనీసం ఈ క్షణంలో కాకపోయినా, మున్ముందు ఎప్పుడయినా జ్ఞానోదయాన్ని స్వాగతిస్తూ జ్ఞానఫలాలు అందుకోవడానికి నన్ను సిద్ధం చేస్తుంది.
అలాగే ఆసక్తి కొద్దీగానీ, ఆశయాల కోసం గానీ, అవసరార్థం గానీ, అడ్డదోవల్లో గానీ, ప్రమాద వశాత్తు గానీ జర్నలిస్టు అవతారమెత్తినవారు, పరకాయ ప్రవేశ విద్యతో రంగప్రవేశం చేసిన వారు....
ఓక్షణం ఆగి ఆత్మదర్శనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయింది.
హుష్! జస్ట్ఎ మినిట్,
- అనుకున్నట్లుగానే పరాభవం కాలింగ్ బెల్ నొక్కుతున్నట్లుంది.
ఓక్షణం ఆగండి. తలుపు తీయకండి!
ప్రశాంతచిత్తంతో అంతర్ముఖులై హృదయగ్రంథంలో
పేజీలు తిరగేస్తూ ప్రశ్నించుకో౦డి.
- ములుగు రాజేశ్వర రావు
నేను జర్నలిస్టునేనా ??? - అని నన్ను నేను ప్రశ్నించుకుంటే అది ఆత్మదర్శనం! నువ్వు జర్నలిస్టువేనా ??? - అని నీవు నన్ను ప్రశ్నిస్తే ... అది పరాభవం! ఆత్మదర్శనంతో అద్భుతాలు జరక్కపోయినా ఆత్మజ్ఞానం (ఆత్మ అనేది ఒకటుందని తెలుసుకోవడం) ప్రజ్వరిల్లుతుంది. కనీసం ఈ క్షణంలో కాకపోయినా, మున్ముందు ఎప్పుడయినా జ్ఞానోదయాన్ని స్వాగతిస్తూ జ్ఞానఫలాలు అందుకోవడానికి నన్ను సిద్ధం చేస్తుంది. అలాగే ఆసక్తి కొద్దీగానీ, ఆశయాల కోసం గానీ, అవసరార్థం గానీ, అడ్డదోవల్లో గానీ, ప్రమాద వశాత్తు గానీ జర్నలిస్టు అవతారమెత్తినవారు, పరకాయ ప్రవేశ విద్యతో రంగప్రవేశం చేసిన వారు.... ఓక్షణం ఆగి ఆత్మదర్శనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయింది. హుష్! జస్ట్ఎ మినిట్, - అనుకున్నట్లుగానే పరాభవం కాలింగ్ బెల్ నొక్కుతున్నట్లుంది. ఓక్షణం ఆగండి. తలుపు తీయకండి! ప్రశాంతచిత్తంతో అంతర్ముఖులై హృదయగ్రంథంలో పేజీలు తిరగేస్తూ ప్రశ్నించుకో౦డి. - ములుగు రాజేశ్వర రావు
© 2017,www.logili.com All Rights Reserved.