గీకు, సంస్కృత పురాణగాథలతో కవికి గొప్ప పరిచయం ఉంది. పురాణ పాత్రలెన్నో అతని కవితల్లో దర్శనమిస్తాయి. వాటిని
అలవోకగా తన కవిత్వంలో ఇముడుస్తాడు. ”మైదాసు స్పర్శ మేలిమినిస్తే, భస్ముడు తాకి భస్మమే చేస్తాడు’ అని స్పర్శా
భేదాన్ని ఒక్క వాక్యంలో తేటతెల్లం చేశాడు. ఈ రెండు స్పర్శలూ వ్యర్థాలే. అందుకే ‘మమతానురాగాలే మనిషి స్పర్శ కానిద్దా’మంటాడు.
వ్యక్తి అహం, ఆత్మవినాశంతోపాటు ప్రపంచ వినాశనానికే దారితీస్తుందన్న స్పష్టమైన అవగాహన కలిగిన వాడు ఈ కవి.
అందుకే నిమ్రోదు, అలెగ్జాండర్, హిట్లర్‌లను అహంకారానికి నిదర్శనాలుగా చూపించాడు.
భావుకత, వాస్తవికత, సందేశాత్మకతలతో కూడుకున్న అందమైన కవితల సంకలనం ‘నేను’ మీ చేతిలో…