"శాస్త్రీయ కమ్యూనిస్టు సిద్ధాంత మూలపురుషుడూ, మహోజ్వల భావుకుడూ, తీక్షణ విప్లవకారుడూ, ప్రపంచ శ్రామికవర్గ దేశికుడూ, నాయకుడూ" అయిన కార్ల్ మార్క్స్ మహత్తర రచన పెట్టుబడి గ్రంథం మొదటి సంపుటం వెలువడి 2017నాటికి నూటయాభై సంవత్సరాలు నిండాయి. మూడు సంపుటాలు ప్రపంచ వ్యాపితంగా పలు భాషల్లోకి నాటి నుండి అనువదించబడి, లక్షల సంఖ్యలో అమ్ముడుపోయాయి. కార్మికవర్గ బైబిల్ గా కీర్తించబడ్డ పెట్టుబడి గ్రంథంలోని సూత్రీకరణలు ఆధునిక పెట్టుబడీదారీ వ్యవస్థను విశ్లేషించడానికీ, అవగాహన చేసుకోవడానికీ అద్వితీయమైన ఆయుధంగా ఉపయోగపడుతుందని సర్వేసర్వత్రా అంగీకరించిన సత్యం.
2008 లో అమెరికాతో ప్రారంభమై ప్రపంచంలోని పెట్టుబడిదారీ దేశాలనూ, వాటితో వ్యాపార లావాదేవీలు కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాలను సహితం కుదిపివేసిన ఆర్ధిక సంక్షోభం అనంతరం మార్క్సిస్టు మేధావులతో పాటుగా ఇతర మేధావులు, ఆర్ధికవేత్తలు పెట్టుబడి గ్రంథాన్ని తిరిగి అధ్యయనం చేస్తున్నారన్న వార్తలు ఆ గ్రంథ ప్రాధాన్యతను నొక్కి వక్కాణిస్తున్నాయి. ఈ పుస్తకం పెట్టుబడి గ్రంథాన్ని అవగాహన చేసుకోవడానికి మార్గదర్శిగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఆ గ్రంథ అధ్యయనానికి సహాయపడే రీతిలో పారిభాషిక పదజాలాన్ని కూడా ఈ చిన్న పుస్తకంతో పాటు అనుబంధంగా ఇస్తున్నాము.
"శాస్త్రీయ కమ్యూనిస్టు సిద్ధాంత మూలపురుషుడూ, మహోజ్వల భావుకుడూ, తీక్షణ విప్లవకారుడూ, ప్రపంచ శ్రామికవర్గ దేశికుడూ, నాయకుడూ" అయిన కార్ల్ మార్క్స్ మహత్తర రచన పెట్టుబడి గ్రంథం మొదటి సంపుటం వెలువడి 2017నాటికి నూటయాభై సంవత్సరాలు నిండాయి. మూడు సంపుటాలు ప్రపంచ వ్యాపితంగా పలు భాషల్లోకి నాటి నుండి అనువదించబడి, లక్షల సంఖ్యలో అమ్ముడుపోయాయి. కార్మికవర్గ బైబిల్ గా కీర్తించబడ్డ పెట్టుబడి గ్రంథంలోని సూత్రీకరణలు ఆధునిక పెట్టుబడీదారీ వ్యవస్థను విశ్లేషించడానికీ, అవగాహన చేసుకోవడానికీ అద్వితీయమైన ఆయుధంగా ఉపయోగపడుతుందని సర్వేసర్వత్రా అంగీకరించిన సత్యం. 2008 లో అమెరికాతో ప్రారంభమై ప్రపంచంలోని పెట్టుబడిదారీ దేశాలనూ, వాటితో వ్యాపార లావాదేవీలు కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాలను సహితం కుదిపివేసిన ఆర్ధిక సంక్షోభం అనంతరం మార్క్సిస్టు మేధావులతో పాటుగా ఇతర మేధావులు, ఆర్ధికవేత్తలు పెట్టుబడి గ్రంథాన్ని తిరిగి అధ్యయనం చేస్తున్నారన్న వార్తలు ఆ గ్రంథ ప్రాధాన్యతను నొక్కి వక్కాణిస్తున్నాయి. ఈ పుస్తకం పెట్టుబడి గ్రంథాన్ని అవగాహన చేసుకోవడానికి మార్గదర్శిగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఆ గ్రంథ అధ్యయనానికి సహాయపడే రీతిలో పారిభాషిక పదజాలాన్ని కూడా ఈ చిన్న పుస్తకంతో పాటు అనుబంధంగా ఇస్తున్నాము.© 2017,www.logili.com All Rights Reserved.