1910 కి అటు ఇటు ఉన్నకాలం తెలుగువారి భాషా, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక జీవనంలో చాలా ముఖ్యమైన కాలం. అంతకుముందు నూరు సంవత్సరాలుగా తెలుగునాట జరిగిన పరిణామాలు 1910 నాటికి స్పష్టం, నిర్దిష్టం అయిన రూపాలు సంతరించుకున్నాయి. అన్ని రంగాలలో ప్రారంభమైన నవ్యమార్గాలు తాత్త్విక భూమికను ఏర్పరచుకొని ఆధునికతలోకి ప్రవేశిస్తున్నాయి. కందుకూరి వీరేశలింగం సంస్కరణ కార్యకలాపాలు కొన్ని పరిమితులకు లోబడినవే అయినా చురుకుగా సాగుతున్నాయి. నవలలు, నాటకాలు, ప్రహసనాలు, వ్యాసాలతో పాటు కందుకూరి ప్రధాన రచనలన్నీ అప్పటికే వచ్చాయి. కవుల చరిత్ర, జీవితచరిత్రలు, స్వీయచరిత్ర, శాస్త్రగ్రంథాలు వచ్చాయి. గిడుగు రామమూర్తి వ్యావహారిక భాషోద్యమం ఊపందుకుంది. గిడుగు విద్యావేత్త, విద్యారంగంలో బోధనలో కొత్తవిధానాలను ప్రవేశపెట్టాడు. గిడుగు తొలి భాషాశాస్త్రజ్ఞుడు, శాసన పరిశోధకుడు, చరిత్రాధ్యాపకుడు. తెలుగువాళ్లలో ఒక ఆదివాసీ భాషను నేర్చి పుస్తకస్థం చేసి నేర్పిన వాళ్లలో మొదటివాడు గిడుగు. తనకున్న భాషా శాస్త్ర పరిజ్ఞానంతో సవరభాషకు వ్యాకరణం, నిఘంటువు తయారుచేశాడు. చరిత్ర పరిశోధనకు, విజ్ఞానశాస్త్ర వ్యాప్తికి ఉద్యమించినవాడు కొమర్రాజు లక్ష్మణరావు. గ్రంథాలయ, గ్రంథ ప్రచురణలను గూడా ఉద్యమస్థాయికి తీసుకొని వెళ్లాడాయన. 1910 నాటికే పూర్వ హైదరాబాదు రాజ్యంలో తెలుగు భాషాచైతన్యం రూపుదిద్దుకొంటున్నది. 1901లో హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వెలసింది. 1904 లో హనుమకొండలో రాజరాజ నరేంద్ర భాషానిలయం, 1905 లో సికిందరాబాదులో ఆంధ్ర సంవర్ధనీ గ్రంథాలయం వచ్చాయి. 1906 లో తెలుగునాట తొలి గ్రంథమాల 'విజ్ఞానచంద్రికా గ్రంథమండలి' హైదరాబాదులో ప్రారంభం అయ్యింది. బ్రహ్మసమాజం అనుయాయిగా, సంఘసంస్కర్తగా, కులభేదాలు లేకుండా అన్నివర్గాలవారికి విద్యనందించడానికి కృషిచేసిన రఘుపతి వెంకటరత్నం నాయుడు తన
1910 కి అటు ఇటు ఉన్నకాలం తెలుగువారి భాషా, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక జీవనంలో చాలా ముఖ్యమైన కాలం. అంతకుముందు నూరు సంవత్సరాలుగా తెలుగునాట జరిగిన పరిణామాలు 1910 నాటికి స్పష్టం, నిర్దిష్టం అయిన రూపాలు సంతరించుకున్నాయి. అన్ని రంగాలలో ప్రారంభమైన నవ్యమార్గాలు తాత్త్విక భూమికను ఏర్పరచుకొని ఆధునికతలోకి ప్రవేశిస్తున్నాయి. కందుకూరి వీరేశలింగం సంస్కరణ కార్యకలాపాలు కొన్ని పరిమితులకు లోబడినవే అయినా చురుకుగా సాగుతున్నాయి. నవలలు, నాటకాలు, ప్రహసనాలు, వ్యాసాలతో పాటు కందుకూరి ప్రధాన రచనలన్నీ అప్పటికే వచ్చాయి. కవుల చరిత్ర, జీవితచరిత్రలు, స్వీయచరిత్ర, శాస్త్రగ్రంథాలు వచ్చాయి. గిడుగు రామమూర్తి వ్యావహారిక భాషోద్యమం ఊపందుకుంది. గిడుగు విద్యావేత్త, విద్యారంగంలో బోధనలో కొత్తవిధానాలను ప్రవేశపెట్టాడు. గిడుగు తొలి భాషాశాస్త్రజ్ఞుడు, శాసన పరిశోధకుడు, చరిత్రాధ్యాపకుడు. తెలుగువాళ్లలో ఒక ఆదివాసీ భాషను నేర్చి పుస్తకస్థం చేసి నేర్పిన వాళ్లలో మొదటివాడు గిడుగు. తనకున్న భాషా శాస్త్ర పరిజ్ఞానంతో సవరభాషకు వ్యాకరణం, నిఘంటువు తయారుచేశాడు. చరిత్ర పరిశోధనకు, విజ్ఞానశాస్త్ర వ్యాప్తికి ఉద్యమించినవాడు కొమర్రాజు లక్ష్మణరావు. గ్రంథాలయ, గ్రంథ ప్రచురణలను గూడా ఉద్యమస్థాయికి తీసుకొని వెళ్లాడాయన. 1910 నాటికే పూర్వ హైదరాబాదు రాజ్యంలో తెలుగు భాషాచైతన్యం రూపుదిద్దుకొంటున్నది. 1901లో హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వెలసింది. 1904 లో హనుమకొండలో రాజరాజ నరేంద్ర భాషానిలయం, 1905 లో సికిందరాబాదులో ఆంధ్ర సంవర్ధనీ గ్రంథాలయం వచ్చాయి. 1906 లో తెలుగునాట తొలి గ్రంథమాల 'విజ్ఞానచంద్రికా గ్రంథమండలి' హైదరాబాదులో ప్రారంభం అయ్యింది. బ్రహ్మసమాజం అనుయాయిగా, సంఘసంస్కర్తగా, కులభేదాలు లేకుండా అన్నివర్గాలవారికి విద్యనందించడానికి కృషిచేసిన రఘుపతి వెంకటరత్నం నాయుడు తన© 2017,www.logili.com All Rights Reserved.