బాల్యం, చదువు, పార్టీలో ప్రవేశం, కృషి - కుటుంబ సభ్యులు
కమ్యూనిస్టు పార్టీలో కామ్రేడ్ ఎన్బిగా సుపరిచితులు అయిన కామ్రేడ్ నాదెళ్ల విజయ భాస్కరరావు గారు కృష్ణాజిల్లా చల్లపల్లికి దగ్గరగా ఉన్న నాదెళ్ళవారిపాలెం అనే గ్రామంలో శ్రీమతి నాదెళ్ళ రంగయ్య, వెంకట నరసమ్మ దంపతులకు 1931 జనవరి 9న జన్మించారు. రంగయ్యగారి సోదరుడు వెంకటసుబ్బయ్య, వారి భార్య బాలాత్రిపుర సుందరి అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండే వారు. వెంకటసుబ్బయ్య గారికి అప్పటికి పిల్లలు లేరు. కుటుంబంలో ఆనాటికి ఎన్విబి ఒక్కడే కాబట్టి ఆయనను చాలా గారాబంగా పెంచారు. తర్వాత వారి బాబాయి బిళ్ళనపల్లి అనే గ్రామానికి వెళ్లి, పొలాలు కొని, అక్కడే స్థిరపడిపోయారు. తండ్రి రంగయ్య గారికి కొంత పొలం ఉండేది. పొలం మీద వచ్చిన ఆదాయంతో కుటుంబ జరుగుబాటు బాగానే ఉండేది.
నాదెళ్ళవారిపాలెం గ్రామ జనాభాలో సగంమంది కమ్యూనిస్టు పార్టీ ప్రభావంలో ఉండేవారు. మిగిలిన వారు కాంగ్రెస్ ప్రభావంలో చల్లపల్లి జమీందారు. అనుయాయులుగా ఉండేవారు. కామ్రేడ్ ఎన్విబి చిన్న వయసులోనే, తండ్రి రంగయ్య గారు చనిపోయారు. తల్లి వెంకటనరసమ్మ గారు ఆయనను పెంచి పెద్ద చేశారు. ఆ ఊరిలో ఉన్న ఏడు నాదెళ్ళ వారి కుటుంబాలు కూడా కమ్యూనిస్టు పార్టీ ప్రభావంలో ఉండేవి. ఊరి ప్రజల మీద, కమ్యూనిస్టు పార్టీ నాయకుల ముఖ్యంగా కామ్రేడ్ సుందరయ్య గారి ప్రభావం చాలా ఉండేది.
నాదెళ్ళ వారి కుటుంబాలలో నాదెళ్ళ చంద్రయ్య గారు, గోపయ్య గారు కమ్యూనిస్టు సాహిత్యాన్ని చదవడం, సభలకు వెళ్లి వచ్చిన అనుభవాలను అందరితో పంచుకోవడం వల్ల ఆ ప్రభావం చాలామంది గ్రామస్థులపై ఉండేది. ఆ కారణంగా అతి చిన్న వయస్కుడైన ఎన్విబి ఆ విషయాలపై ఆసక్తిని పెంచుకొని తరచు వారి................
బాల్యం, చదువు, పార్టీలో ప్రవేశం, కృషి - కుటుంబ సభ్యులు కమ్యూనిస్టు పార్టీలో కామ్రేడ్ ఎన్బిగా సుపరిచితులు అయిన కామ్రేడ్ నాదెళ్ల విజయ భాస్కరరావు గారు కృష్ణాజిల్లా చల్లపల్లికి దగ్గరగా ఉన్న నాదెళ్ళవారిపాలెం అనే గ్రామంలో శ్రీమతి నాదెళ్ళ రంగయ్య, వెంకట నరసమ్మ దంపతులకు 1931 జనవరి 9న జన్మించారు. రంగయ్యగారి సోదరుడు వెంకటసుబ్బయ్య, వారి భార్య బాలాత్రిపుర సుందరి అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండే వారు. వెంకటసుబ్బయ్య గారికి అప్పటికి పిల్లలు లేరు. కుటుంబంలో ఆనాటికి ఎన్విబి ఒక్కడే కాబట్టి ఆయనను చాలా గారాబంగా పెంచారు. తర్వాత వారి బాబాయి బిళ్ళనపల్లి అనే గ్రామానికి వెళ్లి, పొలాలు కొని, అక్కడే స్థిరపడిపోయారు. తండ్రి రంగయ్య గారికి కొంత పొలం ఉండేది. పొలం మీద వచ్చిన ఆదాయంతో కుటుంబ జరుగుబాటు బాగానే ఉండేది. నాదెళ్ళవారిపాలెం గ్రామ జనాభాలో సగంమంది కమ్యూనిస్టు పార్టీ ప్రభావంలో ఉండేవారు. మిగిలిన వారు కాంగ్రెస్ ప్రభావంలో చల్లపల్లి జమీందారు. అనుయాయులుగా ఉండేవారు. కామ్రేడ్ ఎన్విబి చిన్న వయసులోనే, తండ్రి రంగయ్య గారు చనిపోయారు. తల్లి వెంకటనరసమ్మ గారు ఆయనను పెంచి పెద్ద చేశారు. ఆ ఊరిలో ఉన్న ఏడు నాదెళ్ళ వారి కుటుంబాలు కూడా కమ్యూనిస్టు పార్టీ ప్రభావంలో ఉండేవి. ఊరి ప్రజల మీద, కమ్యూనిస్టు పార్టీ నాయకుల ముఖ్యంగా కామ్రేడ్ సుందరయ్య గారి ప్రభావం చాలా ఉండేది. నాదెళ్ళ వారి కుటుంబాలలో నాదెళ్ళ చంద్రయ్య గారు, గోపయ్య గారు కమ్యూనిస్టు సాహిత్యాన్ని చదవడం, సభలకు వెళ్లి వచ్చిన అనుభవాలను అందరితో పంచుకోవడం వల్ల ఆ ప్రభావం చాలామంది గ్రామస్థులపై ఉండేది. ఆ కారణంగా అతి చిన్న వయస్కుడైన ఎన్విబి ఆ విషయాలపై ఆసక్తిని పెంచుకొని తరచు వారి................© 2017,www.logili.com All Rights Reserved.