ఆధునిక యుగంలో ప్రేమను ప్రచురంగా సాహిత్యంలో ప్రవేశపెట్టినవారు భావకవులు. భావ కవిత్వంలో ప్రకృతి పరమైనవి తీసివేస్తే మిగిలినదంతా ప్రేమ కవిత్వమే అనవచ్చు. భావ కవులు ప్రేమ ప్రేమ అని ఎంత పలవరించినా వారికి ప్రేమ గురించి సరియైన అవగాహన లేదు. భావ కవిని ప్రేమ ఎందుకు ఎలా కలుగుతుందని ప్రశ్నిస్తే గాలి ఎందుకు వీస్తుంది? పూలు ఎందుకు పూస్తున్నాయి? అంటాడు తప్పితే మనకర్థమయ్యేలా మాట్లాడదు. భావ కవుల అవ్యాజమైన అనిర్వచనీయమైన ప్రేమ సిద్ధాంతాలు సమాజంలో ప్రేమలో గురించి భ్రమలను, అపోహాలను లేకుండా చేశాయి.
అమలినశృంగారం వంటి పనికిరాని సిద్ధాంతాలు యువతరానికి మేలు చేయకపోగా వింత వింత వాదాలకు, ఆలోచనలకు దారితీశాయి. ఈ ప్రభావం భావ కవుల సమకాలిక రచయితలపై వారి తర్వాతి రచయితలపై వుండి ప్రేమ, పెళ్లి గురించి ఎన్నో అవాస్తవికమైన రచనలు వచ్చాయి. ఈ సమాజంలో ప్రేమ యొక్క వాస్తవ స్థితి గురించి పట్టించుకోని ప్రేమ అవసరాన్ని చాటిన మొదటి రచయిత చలం. తరువాత ప్రేమను సరియైన దృక్పథంతో చూసి దానిని గురించి ఎంతగానో ఆలోచించి రాసిన రచయిత కుటుంబరావు.
సమాజంలో ప్రేమ అవసరాన్ని ఆయన గుర్తించారు. సమాజంలో నూటికి తొంభై పైగా ప్రేమలేని వివాహాలే. ఆ సంసారాల్లోని కుళ్ళును గమనించిన కుటుంబరావు ప్రేమను గూర్చి ఎంతో ఆలోచించి రచనలు చేశారు. ఆయన రాసిన ప్రతి నవలలోనూ ప్రేమ సమస్య వుంటుంది. జీవితాన్ని గమనిస్తూ ప్రేమను అన్ని కోణాల నుండీ చూసి వాస్తవికంగా చిత్రించారు.
- ఓల్గా
ఆధునిక యుగంలో ప్రేమను ప్రచురంగా సాహిత్యంలో ప్రవేశపెట్టినవారు భావకవులు. భావ కవిత్వంలో ప్రకృతి పరమైనవి తీసివేస్తే మిగిలినదంతా ప్రేమ కవిత్వమే అనవచ్చు. భావ కవులు ప్రేమ ప్రేమ అని ఎంత పలవరించినా వారికి ప్రేమ గురించి సరియైన అవగాహన లేదు. భావ కవిని ప్రేమ ఎందుకు ఎలా కలుగుతుందని ప్రశ్నిస్తే గాలి ఎందుకు వీస్తుంది? పూలు ఎందుకు పూస్తున్నాయి? అంటాడు తప్పితే మనకర్థమయ్యేలా మాట్లాడదు. భావ కవుల అవ్యాజమైన అనిర్వచనీయమైన ప్రేమ సిద్ధాంతాలు సమాజంలో ప్రేమలో గురించి భ్రమలను, అపోహాలను లేకుండా చేశాయి. అమలినశృంగారం వంటి పనికిరాని సిద్ధాంతాలు యువతరానికి మేలు చేయకపోగా వింత వింత వాదాలకు, ఆలోచనలకు దారితీశాయి. ఈ ప్రభావం భావ కవుల సమకాలిక రచయితలపై వారి తర్వాతి రచయితలపై వుండి ప్రేమ, పెళ్లి గురించి ఎన్నో అవాస్తవికమైన రచనలు వచ్చాయి. ఈ సమాజంలో ప్రేమ యొక్క వాస్తవ స్థితి గురించి పట్టించుకోని ప్రేమ అవసరాన్ని చాటిన మొదటి రచయిత చలం. తరువాత ప్రేమను సరియైన దృక్పథంతో చూసి దానిని గురించి ఎంతగానో ఆలోచించి రాసిన రచయిత కుటుంబరావు. సమాజంలో ప్రేమ అవసరాన్ని ఆయన గుర్తించారు. సమాజంలో నూటికి తొంభై పైగా ప్రేమలేని వివాహాలే. ఆ సంసారాల్లోని కుళ్ళును గమనించిన కుటుంబరావు ప్రేమను గూర్చి ఎంతో ఆలోచించి రచనలు చేశారు. ఆయన రాసిన ప్రతి నవలలోనూ ప్రేమ సమస్య వుంటుంది. జీవితాన్ని గమనిస్తూ ప్రేమను అన్ని కోణాల నుండీ చూసి వాస్తవికంగా చిత్రించారు. - ఓల్గా© 2017,www.logili.com All Rights Reserved.