సంస్కృతి ప్రజలది. సంస్కృతీ నిర్మాణంలో విద్యది. కీలక పాత్ర. ప్రజా సంస్కృతీ వికాసానికి ప్రజల భాషలో విద్య - పరిపాలన అత్యంతావశక్యమైనది. వలస పాలకుల ప్రత్యక్ష పాలన తొలగిన తర్వాత భారత రిపబ్లిక్ లో, భాషా ప్రయుక్త రాష్ట్రంగా తెలుగు రాష్ట్రమేర్పడిన తర్వాత ఆంద్రప్రదేశ్ లో, కనీసం కొఠారీ కమీషన్ (1966) నివేదిక తర్వాత "తరగతి గదిలో ఆధునిక భారత దేశం నిర్మాణమవుతుంద"ని ఆశించిన వారికి నిరాశలే మిగిలాయి. ఒకవైపున నిరక్షరాస్యులు సంఖ్య (శాతాలు కాదు) పెరిగిపోతూనే వుండగా, తెలుగులో చదువు కూటికీ - గుడ్డకూ పనికి రానిదిగా మారిపోతూ ఇంగ్లీషు చదువుల వేలం వెర్రి పెచ్చరిల్లింది. దీనికి వ్యతిరేకంగా వ్యక్తులుగా వావిలాల గోపాల కృష్ణయ్య, అట్లూరి పురుషోత్తం, కాళోజి లాంటివారు ఎప్పటినుండో కృషిచేశారు.
- జనసాహితి