తెలిసినట్లు చెప్పేది సిద్ధాంతం. అది తెలియకపోతే వేదాంతం. అని పెద్దలమాట. ప్రాచీన హిందూశాస్త్రాలు, వాటికి సంబంధించిన వ్యాఖ్యాన విషయము పూర్తిగా తెలుసుకోలేకపోవటం వల్ల అవి వేదాంతాలుగా మిగిలిపోయాయి. అటువంటి వేదాంతంలో భాగమే రసవాదం. ఈ రసవాదం గూర్చి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇది వాదం కనుక వాదం చేస్తూపోతేనే ఫలితం లేకపోతే వితండమే. ప్రస్తుత గ్రంథం 'రసరత్నాకరం' అనునది నిత్యనాద సిద్ధుడు విరచితమైనది.
ఈయన సిద్ధనాగార్జుని సహచార్యుడు, సమకాలికుడని చరకసంహిత, బాహాటంలోను వీరు శ్రీశైలమందు నివసించే వారని చెప్పబడ్డాయి. ఆచార్య నాగార్జునిచే కూడా 'రసరత్నాకరం' వ్రాయబడినది. దీనిలోని యోగాలు కొన్ని గ్రంథంలో ఉండటం వల్ల వీరు సమిష్టిగా వారి కృషిని చేశారని అనుకోవచ్చు. ఈ రసరత్నాకరం గ్రంథంలో శైవ, బ్రహ్మ చికిత్సతోబాటు తాంత్రిక విధానాలు చర్చించటం చేత ఇది ఆయుర్వేదమునకు, సిద్ధవైద్యమునకు మధ్యగా రెండిటి సారాంశముగా కనబడుచున్నది.
తెలిసినట్లు చెప్పేది సిద్ధాంతం. అది తెలియకపోతే వేదాంతం. అని పెద్దలమాట. ప్రాచీన హిందూశాస్త్రాలు, వాటికి సంబంధించిన వ్యాఖ్యాన విషయము పూర్తిగా తెలుసుకోలేకపోవటం వల్ల అవి వేదాంతాలుగా మిగిలిపోయాయి. అటువంటి వేదాంతంలో భాగమే రసవాదం. ఈ రసవాదం గూర్చి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇది వాదం కనుక వాదం చేస్తూపోతేనే ఫలితం లేకపోతే వితండమే. ప్రస్తుత గ్రంథం 'రసరత్నాకరం' అనునది నిత్యనాద సిద్ధుడు విరచితమైనది. ఈయన సిద్ధనాగార్జుని సహచార్యుడు, సమకాలికుడని చరకసంహిత, బాహాటంలోను వీరు శ్రీశైలమందు నివసించే వారని చెప్పబడ్డాయి. ఆచార్య నాగార్జునిచే కూడా 'రసరత్నాకరం' వ్రాయబడినది. దీనిలోని యోగాలు కొన్ని గ్రంథంలో ఉండటం వల్ల వీరు సమిష్టిగా వారి కృషిని చేశారని అనుకోవచ్చు. ఈ రసరత్నాకరం గ్రంథంలో శైవ, బ్రహ్మ చికిత్సతోబాటు తాంత్రిక విధానాలు చర్చించటం చేత ఇది ఆయుర్వేదమునకు, సిద్ధవైద్యమునకు మధ్యగా రెండిటి సారాంశముగా కనబడుచున్నది.© 2017,www.logili.com All Rights Reserved.